Agnipath Riots: ఫైర్ చేసింది తెలంగాణ పోలీసులా.. రైల్వే పోలీసులా? రాజకీయ కుట్ర జరిగిందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది?

Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ ఘటన చుట్టూ రాజకీయ రచ్చ ముదురుతోంది. కేంద్ర సర్కార్ ను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండగా... రాష్ట్ర సర్కార్ కుట్రతోనే విధ్వంసం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jun 19, 2022, 08:24 AM IST
  • సికింద్రాబాద్ ఘటనపై రాజకీయ రచ్చ
  • తెలంగాణ పోలీసులే ఫైర్ చేశారన్న సంజయ్
  • సీఎంవో, పీకే డైరెక్షన్ లోనే కుట్ర- సంజయ్
Agnipath Riots: ఫైర్ చేసింది తెలంగాణ పోలీసులా.. రైల్వే పోలీసులా? రాజకీయ కుట్ర జరిగిందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది?

Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అదుపులోనికి తీసుకున్న  యువకులను రిమాండ్ కు తరలించారు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా విధ్వంసానికి వ్యూహరచన జరిగిందని గుర్తించిన పోలీసులు.. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నవారి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ అల్లర్లలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును లోతుగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అల్లర్ల కేసులో పోలీసుల విచారణ సాగుతుండగానే.. ఈ ఘటన చుట్టూ రాజకీయ రచ్చ ముదురుతోంది. కేంద్ర సర్కార్ ను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండగా... రాష్ట్ర సర్కార్ కుట్రతోనే విధ్వంసం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.

 ఘటనకు మీరంటే మీరు కారణమంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసుకుంటున్న ఆరోపణలు చేసుకుంటుండగా.. కొత్తగా మరో అంశం చుట్టూ వివాదం రాజుకుంటోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులపై కాల్పులు జరిపింది ఎవరు.. వాళ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు అన్నది చర్చగా మారింది. రైల్వే పోలీసులే కాల్పులు జరిపారని చెబుతోంది టీఆర్ఎస్. ఆర్మీ అభ్యర్థిని బలి తీసుకున్నారని ఆరోపిస్తోంది. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా పాడే మోశారు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రైల్వే పోలీసులే కాల్పులు జరిపారని అంతా భావిస్తుండగా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరో బాంబ్ పేల్చారు. అదే ఇప్పడు సంచలనంగా మారింది.

సికింద్రాబాద్‌ అల్లర్లు తెలంగాణ సీఎంవో కుట్రతోనే జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఇదంతా కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పారు. అంతేకాదు ఆందోళనకారులపై కాల్పులు జరిపింది తెలంగాణ పోలీసులే అని సంజయ్ తెలిపారు. అయినా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై అసత్య ప్రచారం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆర్మీ అభ్యర్థులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు బండి సంజయ్. వరంగల్ లోనూ కేంద్ర సంస్థలపై దాడులకు టీఆర్ఎస్ నేతలు దిగారని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులపై తెలంగాణ పోలీసులే కాల్పులు జరిపారన్న సంజయ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని చెప్పడంతో పాటు సీఎంవో కుట్ర ఉందని సంజయ్ చెబుతుండటంతో.. విధ్వంసకాండ వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సికింద్రాబాద్ విధ్వంసం ఘటన జరిగినప్పటి నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎన్నికల వ్యూహకర్త గా ఉన్న ప్రశాంత్ కిషోర్ పేరు తెరపైకి వచ్చింది. పీకే డైరెక్షన్ లోనే అల్లర్లు జరిగాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. గతంలో ఏపీలో జరిగిన తుని రైలు దగ్దం ఘటన, జగన్ పై జరిగిన కోడి కత్తి ఘటనతో పాటు బెంగాల్ పరిణామాలను ఉదహరిస్తూ కొందరు పోస్టులు పెట్టారు. పీకే ఏ రాష్ట్రంలో పని చేస్తే .. అ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో స్ట్రాటజిస్ట్ డైరెక్షన్ లోనే సికింద్రాబాద్ లో విధ్వంసం జరిగిందన్న బండి సంజయ్ ఆరోపణలు కాక రేపుతున్నాయి. మరోవైపు కాల్పులు జరిపింది ఎవరన్న విషయంపై పోలీసు వర్గాల నుంచి క్లారిటీ రావడం లేదు. సికింద్రాబాద్ లో విధ్వంసం జరిగిన తర్వాత అక్కడికి స్టేట్ పోలీసులు వచ్చారు. నిరసనకారులతో పలుసార్లు చర్చలు కూడా జరిపారు. దీంతో కాల్పులపై రైల్వే పోలీసులు వివరణ ఇస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read also: BSF Job Notification: అగ్నిపథ్‌ జ్వాలల వేళ బీఎస్‌ఎఫ్‌ కీలక నిర్ణయం..281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..!

Read also: Bandi Sanjay on Agnipath: సీఎంవో కుట్రతోనే సికింద్రాబాద్ అల్లర్లు..బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News