Student Suicide Note: మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనే కొండంత ఆశలతో పట్నం చేరిన ఆ విద్యార్థి పోటీపరీక్షలతో కలిగే మానసిక ఒత్తిడి తట్టుకోలేక శవమై నిర్జీవంగా అమ్మానాన్నాల ముందుకొచ్చాడు. అలాగని చదువులో పూర్ స్టూడెంట్ అనుకోవద్దు.. బోర్డ్ ఎగ్జామ్స్‌తో సహా.. అతడు రాసిన ప్రతీ పోటీ పరీక్షల్లో తనే ఫస్ట్.. 12వ తరగతి పరీక్షలో 93 శాతం మార్కులతో ఫస్ట్ ర్యాంక్‌లో పాస్ అయ్యాడు. అంతెందుకు.. మెడిసిన్‌లో సీటు కోసం శక్షణ తీసుకుంటున్న కోచింగ్ సెంటర్లోనూ ఏ పరీక్ష పెట్టినా ఫస్ట్ క్లాస్ మార్కులు అతడికే వచ్చేవి. అయినా ఏదో తెలియని మానసిక ఒత్తిడి ఆ విద్యార్థిని మానసికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అందుకే ఇక నా వల్ల కాదనుకున్నాడు. డాక్టర్ కావాలనుకున్న తన కోరికకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. తను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావులోనూ నాలుగే ముక్కల్లో గుండెల్ని పిండేసే సూసైడ్ నోట్ వదిలివెళ్లాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌కి చెందిన మంజోత్ ఛాబ్రా అనే కాబోయే మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య ఎంతోమందిని ఎంతో కదిలిస్తోంది. మెడిసిన్‌లో సీటు సాధించాలనే లక్ష్యంతో యూపీలోని రాంపూర్ నుండి రాజస్థాన్‌లోని కోటాకు చేరాడు. మంజోత్ ఛాబ్రాతో పాటు అతడి క్లాస్‌మేట్స్ మరో ఇద్దరూ కూడా అదే లక్ష్యంతో అతడి వెంటే వెళ్లారు. ముగ్గురూ కలిసి ఒకే హాస్టల్లో వేర్వేరు గదులు తీసుకున్నారు. మంజోత్ మంచి తెలివైన కుర్రాడు మాత్రమే కాదు.. అందరితో కలివిడిగా, ఎంతో జాలీగా, సరదాగా ఉండేవాడు. అందుకే మంజోత్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి మంజోత్ బుధవారం అర్ధరాత్రి తెల్లవారితే గురువారం అనగా సూసైడ్ చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. 


మంజోత్ ఛాబ్రా తన ఆత్మహత్యలోనూ ఎంతో సంఘర్షణకు గురయ్యాడని అతడు రాసిన సూసైడ్ నోట్స్ చూస్తే అర్థం అవుతోంది. తను చేస్తోన్న పనికి తనని క్షమించండి అని కోరుతూ తన తండ్రికి సారీ పపా అంటూ ఓ నోట్ పెట్టిన మంజోత్.. తాను తీసుకుంటున్న ఈ నిర్ణయం తను ఇష్టపూర్వకంగా చేస్తోన్నదేనని.. తన స్నేహితులు ఎవ్వరూ తన తల్లిదండ్రులను నిందించకండి ప్లీజ్ అంటూ స్నేహితులను వేడుకున్నాడు. అంతేకాదు.. హ్యాపీ బర్త్ డే పపా అంటూ తను చస్తూ తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు చూపరులను ఎంతో కలిచివేస్తోంది. తను చనిపోయే క్షణంలో తన తల్లిదండ్రులకు ఏ మాట రాకుండా ఉండాలని తపించడంతో పాటు తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంజోత్ ఆ సమయంలో ఎంత మానసిక సంఘర్షణకు గురై ఉంటాడో అర్థం చేసుకోవడం హృదయం ఉన్న వారికి ఎవరికైనా పెద్ద కష్టమైన పనేం కాదు.  


ఆ ఒక్క మాట తల్చుకుని బోరుమన్న తోటి విద్యార్థులు
కోటాలో జరుగుతున్న స్టూడెంట్స్ సూసైడ్స్ గురించి చర్చకొచ్చిన ప్రతీసారి తరువాత లైన్లో ఉన్నది తనేనని అనేవాడని.. కానీ అతడి మాటల్లో ఉన్న గూడార్థాన్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయామని తోటి విద్యార్థులు బోరుమన్నారు. 


ఇది కూడా చదవండి : Giant Anaconda Snake Video: నిజంగానే ఇంత భారీ ఆనకొండ ఉంటుందా ?


కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ వరుస సూసైడ్స్ 
రాజస్థాన్‌లోని కోటాకు కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుంది. దేశం నలుమూలల నుంచి.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన విద్యార్థులు అనేక పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. కోటా నిండా కోచింగ్ సెంటర్సే ఉండటంతో విద్యార్థులు అందరికీ కోటా సిటీ కోచింగ్ క్యాపిటల్‌గా నిలిచింది. అదే సమయంలో తరుచుగా కోటాలో స్టూడెంట్స్ వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కూడా ఆందోళనరేకెత్తిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం కోసం కోటాకు వచ్చి.. మానసిక ఒత్తిడి తట్టుకోలేక తనువు చాలిస్తున్న వారి సంఖ్యే ఎక్కువుంది.


ఇది కూడా చదవండి : How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి