How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?

How To Earn More Money: చదువుకునే రోజుల్లో జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో ప్రతీ ఒక్కరికీ ఖరీదైన బంగ్లా, లగ్జరీ కారు, లగ్జరీ లైఫ్.. ఇలా ఏవేవో కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేసుకోవాలంటే కేవలం సంపాదన ఒక్కటే ఉంటే సరిపోదు.. మరి ఇంకేం కావాలో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే. 

Written by - Pavan | Last Updated : Aug 4, 2023, 07:08 PM IST
How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?

How To Earn More Money: ఆర్థికంగా మీ భవిష్యత్ బాగుండాలి అంటే మొదటి నుండే ఒక ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. సంపాదించడం మొదలైన తొలినాళ్లలోనే విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ పోతే ఆ తరువాత ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏమీ మిగలకపోగా ఆర్థికంగా కష్టాలపాలు అవుతారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీకు సంపాదించడంతో పాటు కొన్ని ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సూత్రాలు కూడా తెలిసి ఉండాలి. 

ఉదాహరణకు ఒక టాప్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంను ఒక ఇన్సూరెన్స్ యాగ్రిగేటర్ అధ్యయనం చేయగా.. ఒక వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ ప్రీమియం చెల్లించినట్టు ఆ అధ్యయనం చెబుతోంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో 10 ఏళ్లు ఆలస్యం చేశారనుకోండి.. 25 ఏళ్ల వ్యక్తి అయితే 48 శాతం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. 35 ఏళ్ల వ్యక్తి విషయంలోనైతే 72% అదనంగా, అలాగే 45 ఏళ్ల వ్యక్తి విషయంలోనైతే 89% అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సేవింగ్స్ సంబంధిత అంశాల్లో ఎంత చిన్న వయస్సులో సేవింగ్స్ మొదలుపెడితే అంత ఎక్కువ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

చదువుకునే రోజుల్లో జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో ప్రతీ ఒక్కరికీ ఖరీదైన బంగ్లా, లగ్జరీ కారు, లగ్జరీ లైఫ్.. ఇలా ఏవేవో కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేసుకోవాలంటే కేవలం సంపాదన ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. మొదటిసారి జీతం అందుకోగానే ఏదో తెలియని ఒక మధురమైన అనుభూతి ఉంటుంది. అప్పటివరకు అమ్మానాన్న ఇచ్చిన పాకెట్ మనీ మాత్రమే తెలిసిన మనం.. సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బులను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఇక మనం కన్న కలలు నిజం చేసుకోవడం మొదలుపెట్టొచ్చు అనే ఆనందం. కానీ ఆనందం అలాగే ఉండాలి.. అప్పటివరకు కన్న కలలు నిజంచేసుకోవాలంటే జీవితంలో కొన్ని చేయాల్సినవి, ఇంకొన్ని చేయకూడని విషయాలు తెలిసి ఉండాలి. అది చెప్పడమే ఈ కథనం ముఖ్య లక్ష్యం. 

సంపాదన, ఖర్చులు, బడ్జెట్ లెక్కలు :
మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, వివిధ అవసరాల నిమిత్తం ఎంత ఖర్చు అవుతుంది అని వివరంగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందించుకోండి. ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్క పెట్టుకోండి.. ఇంకా చెప్పాలంటే రాసిపెట్టుకోండి. అలా చేయడం వల్ల ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో తెలుసుకుని ఆ ఖర్చుని తగ్గించుకునే వీలు ఉంటుంది.

రెగ్యులర్ సేవింగ్స్, పెట్టుబడి.. రెండూ ముఖ్యమే :
మీకు వచ్చే నెల జీతంలోంచి కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బు జమ అయ్యేలా నెల జీతం రాగానే శాలరీ ఎకౌంట్లోంచి సేవింగ్స్ ఎకౌంట్లోకి ఆటోమేటిక్ ట్రాన్స్ ఫర్ పెట్టుకోండి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్ మార్కెట్, బాండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వంటి మార్గాల్లో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి.

లెక్కకు మించి ఖర్చు చేయడం :
లెక్కకు మించి ఖర్చు చేయడం అనేది మీ ఫినాన్షియల్ హెల్త్ కి అస్సలే మంచి అలవాటు కాదు. సిగరెట్ తాగడం, మద్యం సేవించడం అనేవి ఆరోగ్యానికి హానికరం అనేది ఎంత వాస్తవమో.. మీ సంపాదనకు మించి ఖర్చు చేయడం కూడా మీ ఫినాన్షియల్ హెల్త్ కి అంత మంచిది కాదు అనేది కూడా అంతే వాస్తవం. లెక్కకు మించి ఖర్చు చేసే అలవాటు మానేయాలి. సంపాదించిన దానికంటే ఖర్చు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. 

ఎమర్జెన్సీ ఫండ్ :
మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. ఆ సమస్యను అధిగమించేందుకు ఎప్పుడూ మీ వద్ద కొంత అత్యవసర నిధి అనేది ఉండాలి. మీకు ప్రత్యేకంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటే.. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు మీ సేవింగ్స్ జోలికి వెళ్లాల్సిన పని లేదు. అలాగే ఎవ్వరినీ అప్పు అడగాల్సిన పని అస్సలే లేదు. 

హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ :
హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్.. జీవితానికి ఈ రెండూ ముఖ్యమే. ఏదైనా అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైనా.. లేదా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చేరినా.. అప్పుడు మిమ్మల్ని హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆదుకుంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా. సంపాదించే వయస్సులో ఉన్నప్పుడు పొదుపు చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ మీకు భవిష్యత్తులో ఏదో ఒక అత్యవసరానికి ఆదుకుంటుంది. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎంత యుక్త వయస్సులో తీసుకుంటే మీరు అంత ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భారీ మొత్తంలో చిలుం వదిలించుకోవాల్సి వస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే వయస్సు ఎంత ఎక్కువ పెరిగితే.. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంత ఎక్కువ ఖరీదు అవుతాయి. 

ఇది కూడా చదవండి : Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది

నిత్య విద్యార్థిలా ఉండండి :
ఎవరి జీవితంలోనైనా పర్సనల్ ఫైనాన్స్ అనేది చాలా కీలకమైనది. మీ డబ్బును, మీ కష్టార్జితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోతే.. మీ కష్టం అంతా వృథా అవుతుంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి, సేవింగ్స్ గురించి పుస్తకాలు చదవడం, ఫైనాన్షియల్ బ్లాగ్స్ చదవడం, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. లేదంటే జీవితంలోనే కాదు.. ఆర్థికంగానూ వెనుకబడిపోతారు.

ఇది కూడా చదవండి : Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News