ATM pin: పర్సు, మొబైల్ కొట్టేసి.. ఏటీఎం పిన్ కోసం వెనక్కి తిరిగొచ్చారు.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి
నొయిడా: రాత్రి వేళ డిన్నర్ చేద్దామని బయటికి వచ్చిన ఓ వ్యక్తిని బైక్‌పై వచ్చి తుపాకీతో బెదిరించి ( Gun point ) అతడి పర్సు, మొబైల్ చోరీ చేసిన ఇద్దరు దుండగులు.. కొంత దూరం పోయాకా అతడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ( ATM pin ) తెలుసుకుందామని మళ్లీ వెనక్కి వచ్చారు... ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటో మీరే చూడండి.
నొయిడా: రాత్రి వేళ డిన్నర్ చేద్దామని బయటికి వచ్చిన ఓ వ్యక్తిని బైక్‌పై వచ్చి తుపాకీతో బెదిరించి ( Gun point ) అతడి పర్సు, మొబైల్ చోరీ చేసిన ఇద్దరు దుండగులు.. కొంత దూరం పోయాకా అతడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ( ATM pin ) తెలుసుకుందామని మళ్లీ వెనక్కి వచ్చారు. బాధితుడిని మళ్లీ అలాగే తుపాకీతో బెదిరించి ఏటీఎం పిన్ ( ATM pin code ) అడిగి తెలుసుకుని మళ్లీ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు వెళ్తున్న రహదారిపై కాపుకాసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన దుండగులు ఇద్దరూ పోలీసులపైకి కాల్పులు జరిపి ( Opned fire ) అక్కడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం పోలీసులు వారిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులకు గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఫేజ్ 3 పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని నొయిడా సెంట్రల్ డీసీపీ హరీష్ చందర్ తెలిపారు. (Also read: Cyber crime: సోషల్ మీడియాలోని ఫోటోలతో మార్ఫింగ్.. యువతులు, మహిళలపై వేధింపులు.. )
నిందితులను ( Mobile snatchers ) వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించిన నొయిడా పోలీసులు.. నిందితుల నుంచి బాధితుడి పర్సు ( wallet ), మొబైల్ ఫోన్ ( Mobile phone ) స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. అనంతరం నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 2 నాటు తుపాకీలు ( Country made pistols ), బైకుని సీజ్ చేశారు. ఇదే కాకుండా నిందితులు చోరీకి పాల్పడింది ఫేజ్ 3 పోలీసు స్టేషన్ పరిధిలో కావడంతో అక్కడి పోలీసు స్టేషన్‌లోనూ నిందితులపై చర్యలు తీసుకుంటున్నట్టు డీసీపీ హరీష్ చందర్ తెలిపారు. ( Sex racket: సెక్స్ రాకెటీర్ సోనూ పంజాబన్‌కి 24 ఏళ్ల జైలు శిక్ష )