Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీతో పాటు తమిళనాడులోని చెన్నైపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిన్నటి నుంటి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. చెన్నైలో రోడ్లపై ప్రవహిస్తున్న నీరు చూస్తుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. రేపు మద్యాహ్నం నిజాంపట్నం లేదా బాపట్ల సమీపంలో తీరం దాటవచ్చని తెలుస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు చెన్నైలో మాత్రం బీభత్సకర వాతావరణం కన్పిస్తోంది. చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రిజర్వాయర్లు, చెరువులు , వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లపైకి నీరు వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోకాలు లోతలో, ఇంకొన్ని ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు చేరుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో సన్నని రోడ్లపై భారీగా నీరు ప్రవహించి కాలువల్ని తలపిస్తున్నాయి.



ఫలితంగా రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు, కార్లు వేగంగా కొట్టుకుపోతున్న దృశ్యాలు భయం గొలుపుతున్నాయి. చెన్నై రైల్వే స్టేషన్లలో నీరు చేరడంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. అటు చెన్నై విమనాశ్రయానికి కూడా భారీ వర్షాల కారణంగా నీరు చేరిపోయింది.



చాలా విమానాలు రద్దు కాగా పలు విమానాలు చెన్నై రాకుండానే దారి మళ్లించారు. చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో భారీ వర్షాలు సముద్రగాలులతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది.



Also read: Michaung Cyclone: తీవ్రరూపం దాలుస్తున్న మిచౌంగ్ తుపాను, భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook