microsoft windows computers leading to blue screen of death: ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ప్రతి పని కూడా సిస్టమ్ ల మీద చేస్తుంటాం. కోట్లలో లావాదేవీలు సైతం.. ఒక్క బటన్ క్లిక్ చేయడంతో అయిపోతుంతాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు, స్టాక్స్ లు మొదలైనవన్ని కూడా ఆన్లైన్ వేదికగా జరుగుతుంటాయి. దీంతో ప్రస్తుతం నెట్ కు ఒక రేంజ్ లో డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనిషి ఒక్క నిముషం మొబైల్, దానికి ఇంటర్  నెట్ లేకుండా ఉండడేడని చెప్పవచ్చు. టెక్నాలజీ అంతగా డెవలప్ అయ్యింది. డైలీ లైఫ్ లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయంతో పాటు.. అన్ని రకాల ఆఫీసు, అఫిషియల్  పనులు కూడా ఆన్ లైన్ వేదికగా జరుపుకునే వేసులు బాటు ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ నేపథ్యంలో ఇంటర్నేట్ కు ఏదైన అంతరాయం ఏర్పడితే జనాల్లో పెద్ద గందర గోళం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో కొన్నిసార్లు ఫెస్ బుక్, వాట్సాప్ , ఇన్ స్టాలు, కొంత సేపు అంతరాయం కల్గిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిరకాల టెక్నికల్ సమస్యల వల్ల పనిచేయడం ఆగిపోయి,మరల ప్రాబ్లమ్ సాల్వ్ కాగానే పనిచేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ విండోస్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పనిచేయడం ఆగిపోయింది. ఒక్కసారిగా సర్వర్ లు డౌన్ అయిపోయారు.  దీంతో యూజర్ లు ఒక్కసారిగా షాక్ కుగురయ్యారు.


కొంత సేపటికి ఏమైందో అని సామాజిక మాధ్యమాలలో కామెంట్లు పెట్టారు. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా..  ‘మైక్రోసాఫ్ట్ ఔటేజ్’ సమస్య కారణంగా ఇబ్బందులు వచ్చినట్లు గుర్తించారు. దీని ప్రభావం వల్ల.. అంతర్జాతీయంగా విమానాలు, మార్కెట్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీ సేవలు, టెకీ కంపెనీల ల్యాపీలు సైతం పనిచేయడం ఆగిపోయాయి. దీంతో అనేక రంగాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’ (Blue Screen of Death) సమస్య అంటారని, దీని వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఐటీ నిపుణులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 


ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.  దీని వల్ల అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాలు సైతం తమ సేవల్లో అంతరాయం కల్గటం వల్ల ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది.  దీని ఎఫెక్ట్ తో.. విమానాశ్రయాలు, టెలివిజన్ వార్తా స్టేషన్లు, పలు ఆర్థిక సంస్థలు సహా అనేక చోట్ల ఈ ప్రభావం కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అయ్యిందని అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఘటనతో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో..Blue Screen of Death అనే హ్యష్ టాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి