Flights Collision: గాల్లో ఎదురెదురుగా వచ్చిన రెండు ఇండిగో విమానాలు.. ఆ తర్వాత ఏమైంది?
Flights Collision: బెంగళూరులో భారీ విమాన ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే..
Flights Collision: బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలో ఇటీవల భారీ ప్రమాదం తప్పింది. ఇండియా సంస్థకు చెందిన రెండు విమానాలు దాదాపు ఢీకొన్నంత పనైంది. రాడార్ కంట్రోలర్ అప్రమత్తత కారణంగా ఈ ప్రమాదం (IndiGo mid air collision) తృటిలో తప్పింది.
అయితే ఇంతటి భయంకరమైన ఘటన గురించి లాగ్‌బుక్‌లో నమోదు చేయడం గానీ లేదా.. అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానయాన నియంత్రణ సంస్థకు గానీ నివేదించకపోవడం మరింత ఆందోళన కలిగించే (IndiGo Flight accident) విషయం.
నిజానికి ఈ ఘటన ఈ నెల 9న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరవల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ (DGCA on mid air collision) ఇచ్చింది.
అసలు ఏమైందంటే..
ఇండిగోకు చెందిన 6ఈ 455 విమానం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లేందుకు గాళ్లోకి ఎగిరింది. ఇందుకు సౌత్ టవర్ కంట్రోలర్ అనుమతినిచ్చారు.
ఇదే సమయంలో 6ఈ 246 విమానం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లేందుకు సిద్ధమైంది దీనికి నార్త్ టవర్ కంట్రోలర్ అనుమతినిచ్చారు.
రెండు విమానాలు కేవలం ఐదు నిమిషాల గ్యాప్‌లో గాళ్లోకి ఎగిరాయి. దీనితో గగన తలంలో రెండు విమానాలు ఎదురెదురుగా అత్యంత సమీపానికి (Collision Averted) వచ్చాయి. ఇది గమనించిన రాడార్ కంట్రోలర్ పైలట్లను అప్రమత్తం చేసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది.
ఇంతకీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే..
కెంపగౌడ విమానాశ్రయంలో రెండు రన్వేలు ఉన్నాయి. ఒకటి ఉత్తరం వైపు ఉంటుంది. దీనిని టేకాఫ్ కోసం ఉపయోగిస్తారు. రెండోది దక్షిణం వైపు ఉన్నాయి. దీనిని ల్యాండింగ్ కోసం వినియోగిస్తుంటారు.. అయితే ఈ ఘటన జరిగిన రోజు సౌత్ రన్‌వేను మూసేసి.. నార్త్ రన్‌వేను టేకాఫ్, ల్యాండింగ్ కోసం వినియోగించాలని సంబంధిత ఇన్ఛార్జ్ నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని సౌత్ కంట్రోలర్‌కు అందించలేదు. దీనితో ఈ ప్రమాదానికి అవకాశమిచ్చినట్లైంది.
ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో 176 మంది ప్రయాణుకులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇక భువనేశ్వర్ వెళ్లాల్సిన విమానంలో 238 ప్యాసింజర్లు, 6గురు సిబ్బంది (IndiGo flights Bengaluru) ఉన్నారు.
Also read: Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు
Also read: Goa assembly Elections: గోవా ఆప్ 'సీఎం' అభ్యర్థిగా అమిత్ పాలేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి