నాలుగు దశాబ్దాల సేవలకు ఇక సెలవు. అవును .. బహదూర్ ఇప్పుడు విశ్రాంతి తీసుకోనుంది. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నారనుకుంటున్నారా..! భారత వైమానిక దళానికి సేవ చేసిన మిగ్-27 గురించే. అవును.. 40 ఏళ్ల పాటు భారత వైమానిక దళానికి సేవలు అందించిన మిగ్- 27 ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకోసం రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వాటర్ సెల్యూట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగ్-27  విమానానికి రెండు వైపులా పెద్ద వాటర్ కేనన్ లు జలాభిషేకం చేశాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ సైనికులు మిగ్-27కు గౌరవ వందనం చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిగ్-27 ప్రత్యేకతలు 
* నాలుగు దశాబ్దాలుగా వైమానిక దళానికి సేవలు
* 1999 కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర 
* ఆపరేషన్ పరాక్రమ్ లో ముఖ్య భూమిక 
* ఇప్పటి వరకు IAF- 29 స్క్వాడ్రన్ లో సేవలు


[[{"fid":"180740","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]