అహ్మదాబాద్: గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శించారు. తమను సొంత గ్రామాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్‌ చేస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వజ్రాలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు. పోలీసులపై కార్మికులు దాడి చేయడం ఇది నాలుగోసారని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాకుండా సూరత్‌ శివార్లలోని వరేలి ప్రాంతంలో కార్మికులు ఆందోళనకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాక్‌డౌన్‌లో మిల్కీ ‘బ్యూటీ’ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. ఈ క్రమంలో ఆందోళనకారులను నిలువరించేందుకు వారిపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. సూరత్‌లోని పాలన్‌పూర్‌ పాటియా వంటి ప్రాంతాల్లోనూ వలస కార్మికులు ఆందోళనకు దిగారు.  ఏప్రిల్‌ 10వ తేదీన వలస కార్మికులు సూరత్‌ రోడ్లపైకి వచ్చిన నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. పలు వాహనాలకు నిప్పుపెట్టి లాక్‌డౌన్‌ వల్ల తాము బతకడం కష్టమైందని స్వస్థలాలకు పంపించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!