ముంబై: లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముంబైలోని వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పొట్టకూటి కోసం ముంబైకి వచ్చిన బీహార్, పశ్చిమ బెంగాల్‌కి చెందిన వలసకార్మికులు మంగళవారం ముంబైలోని బాంద్రా బస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు. తమను తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని.. లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలో ఆహారం, ఇతర నిత్యావసరాలు ఏవీ దొరక్క బతుకు దుర్బరంగా మారిందని వలస కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. వేలాది మంది వలస కార్మికులు ఒక్కచోటికి రావడంతో బాంద్రా పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లాక్ డౌన్ కొనసాగింపుని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఒక్క చోట చేరుతుండటం గమనించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్‌డౌన్ విధించి సోషల్ డిస్టన్సింగ్ పాటించాల్సి వచ్చిందని.. ఆందోళనకారులు నిరసన విరమించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తికి ఆందోళనకారులు స్పందించలేదు. దీంతో ముంబై పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ముంబై పోలీసులు లాఠీలు తీయడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, పీజీసెట్, లా సెట్ పరీక్షలకు తేదీలు ప్లానింగ్ ?


బాంద్రా ఘటనపై డీసీపీ పీఆర్వో ప్రణయ్ అశోక్ స్పందిస్తూ... దాదాపు 1500 మంది బాంద్రా పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారని.. వారికి ఎంత నచ్చజెప్పి ఆందోళన విరమింపచేసే ప్రయత్నం చేసినా.. వారు తమ మాటలను లెక్కచేయలేదని అన్నారు. అంతేకాకుండా పోలీసులతో వాగ్వీవాదానికి దిగారని.. అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత బాంద్రాలో పరిస్థితి యధాస్థితికి వచ్చిందని డీసీపీ పీఆర్వో ప్రణయ్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..