ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, పీజీసెట్, లా సెట్ పరీక్షలకు తేదీలు ప్లానింగ్ ?

కరోనా వైరస్ నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారా అంటే అవుననే తెలుస్తోంది.

Last Updated : Apr 14, 2020, 10:38 PM IST
ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, పీజీసెట్, లా సెట్ పరీక్షలకు తేదీలు ప్లానింగ్ ?

హైదరాబాద్‌: కరోనా వైరస్ నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. మే 3 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండనుండగా.. ఆ తర్వాతయినా కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని ఆశిస్తున్న అధికారులు.. మే నెల చివర్లో ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ప్రవేశ పరీక్షలను నిర్విహిస్తే ఎలా ఉంటుందని ముందస్తు ప్రణాళికలు రచించుకుంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మే నెల మూడో వారంలో ఎంసెట్ పరీక్షలతో పాటు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను కూడా ప్రారంభించి జూన్‌ 1వ తేదీ నాటికి వాటిని పూర్తి చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా విడుదల చేస్తే.. ఇంటర్ విద్యార్థులకు విలువైన విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉంటుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోందట.

Also read : illicit liquor: డ్రోన్ల సహాయంతో అక్రమ మద్యం పట్టివేత

ఎంసెట్ ఎగ్జామ్స్ తరహాలోనే వాయిదా పడిన ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్‌ ప్రవేశపరీక్షలను సైతం జూన్ మొదటి వారం నుండి జూన్‌ 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అనుకున్న విధంగానే ఈ పరీక్షలన్నింటినీ పూర్తి చేయగలిగితే.. జూలైలో అడ్మిషన్స్ చేపట్టవచ్చని అధికార యంత్రాంగం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News