Owaisi on Lakhimpur kheri: లఖీంపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హింసాత్మకంగా మారిన ఈ ఘటనపై ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో(Lakhimpur kheri)నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రేతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకుపోయి నలుగురు రైతులు మరణించారు. ఈ ఘటనలో మృతి చెందిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన విపక్షనేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. అటు రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారం, గాయపడినవారికి 10 లక్షల పరిహారమిచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు.


లఖీంపూర్ ఖేరీ ఘటనకు పూర్తి బాధ్యత యూపీలోని యోగీ ప్రభుత్వానిదేనని(Yogi Government) అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మండిపడ్డారు. లఖీంపూర్ వెళ్లకుండా విపక్షాల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. యూపీ పోలీసులతో దర్యాప్తులో న్యాయం జరగదన్నారు. విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ సైతం ఆందోళన చేపట్టింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్ వద్ద యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో నవజ్యోత్ సింగ్ సిద్దూ (Navajyoth singh sidhu)పాల్గొన్నారు. చండీగడ్ పోలీసులు సిద్ధూను అరెస్టు చేశారు. అటు యూపీ భవన్ (UP Bhavan)వద్ద ఆందోళన నిర్వహించిన యూత్ కాంగ్రెస్ వర్గీయుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం యూపీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లఖీంపూర్ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. యూపిలో సెక్షన్ 144 అమల్లో ఉంది. 


Also read: Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి