న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కరోనా హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు సడలించడంలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆ జోన్లలో సినిమా హాల్స్, షాపింగ్ సముదాయాలు, ప్రార్థనా మందిరాలు మే 3 వరకు ఎట్టిపరిస్థితుల్లో తెరచుకోబోవని స్పష్టం చేశారు. మరోవైపు కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని రకాల మినహాయింపులు ఉంటాయని అన్నారు. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత 28 రోజుల్లో పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని, గడచిన 14 రోజుల్లో మరో 54 జిల్లాల్లో పాజిటివ్ కేసలు నమోదు కాలేదని పేర్కొన్నారు. కరోనా బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పోరాడుతున్న వైద్యలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన భద్రత కల్పించాలని సూచించారు. కరోనా నివారణ వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకు సంబంధించిన అభివృద్ధి పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నియమ నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు.   పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య


గత 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,334 అని, 27 మంది మృతి చెందారని చెప్పారు. దీంతో, దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకే కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,231 మంది కాగా, 507 మంది మృతి చెందారని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Also Read: ‘క్రికెట్ అంటే పిచ్చి.. కానీ ఈ ఐపీఎల్ కష్టమే’