I&B Ministry Twitter account hacked: దేశంలో కొద్ది కాలంగా ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుటికే పలువురు ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్ (Hacking) గురయ్యాయి. అయితే తాజాగా బుధవారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా (Ministry of Information and Broadcasting Twitter Account) హ్యాక్ అయింది. కొద్దిసేపటి తర్వాత అకౌంట్ ను తిరిగి పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్​ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. హ్యాండిల్ పేరును 'ఎలాన్ మస్క్' (Elon Musk) గా మార్చారు. తద్వారా వరుసగా 50కిపైగా ట్వీట్లు చేశారు. హరీ అప్​(Hurry Up), అమేజింగ్​ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఫొటోతో హైపర్​లింక్​లు పెట్టారు. ఈ ట్వీట్లు గందరగోళానికి గురి చేశాయి. వెంటనే  అప్రమత్తమైన అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. అయితే ఎవరు హ్యాక్ చేశారనే విషయంపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (MEIT) చెందిన ఐటీ సెక్యూరిటీ గ్రూప్ (CERT-IN) పరిశీలిస్తోంది. 


Also Read: Supreme Court: ఇంటి కోసం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్న వేధింపే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు


నెల రోజుల కిందట డిసెంబర్​ 12న కూడా ప్రదాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్​కు గురైంది. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు పెట్టారు. లోపాలను సవరించి కాసేపటికే ప్రధాని ఖాతాను అధికారులు పునరుద్ధరించారు. అలాగే ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఆఫైర్ (ICWA), ఇండియన్ మెడికల్  అసోసియేషన్ (IMA) ట్విట్టర్ ఖాతాలు కూడా హ్యాకింగ్ బారిన పడ్డాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి