'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతున్న వేళ.. భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(బుధవారం) ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ( గురువారం) విడుదలకానున్నాయి. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో .. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ సోషల్ మీడియాలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుందనే ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస  కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇళ్లకు వెళ్లలేక అవస్థలు  పడుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్లపై వలస  కార్మికులు నడుచుకుంటూ వందల కిలోమీటర్లు వెళ్తున్న పరిస్థితి చూశాం. ఐతే  వారిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యే రైళ్లను నడిపిస్తుందని.. సోషల్ మీడియాలో ప్రచారం  ప్రారంభమైంది. 


ఐతే అలాంటివి అన్ని పుకార్లు మాత్రమేనని రైల్వే మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఎలాంటి ప్రత్యేక రైళ్లు నడపడం లేదని .. మే 3  వరకు ప్రయాణీకుల రైల్వే సర్వీసులకు సంబంధించి అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు  రైల్వే  మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని కోరింది.



అలాగే మే 3 వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 37 వేల రైళ్లు లూప్ లైన్లకే పరిమితమయ్యాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..