ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు మోడీ సర్కార్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. మధ్యతరగతి ముఖ్యంగా ఉద్యగోలకు ఊరటనిచ్చేలా.. ఆదాయపున్ను పరిమితిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆధాయపు పన్ను రెట్టింపు చేయాలనే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్ననట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదాయపు పన్ను పరిమితి రెట్టింపు ?


ప్రస్తుతం వార్షికాదాయం రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకపోగా.. ఆ పరిమితిని రెట్టింపు చేసి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్వరలో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌లో దీనిని ప్రస్తావిస్తారని ఊహాగానాలు వెలువడతున్నాయి. గత ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్నందున మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది


కేంద్ర మంత్రి చెప్పిన మరో సిక్స్ ఇదేనా ?


అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్సిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా అగ్రవర్ణాలను ఆకర్షించిన మోడీ సర్కార్ ఇప్పుడు మధ్యతరగతిని టార్గెట్ చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సమయంలో ప్రతిపక్షాలపై ఎదురుదాడిలో భాగంగా కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ  మున్ముందు మరిన్ని సిక్స్ లు కొడుతామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. ఈ సిక్సర్లలో భాగంగా ఈ నిర్ణయం ఉండవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి