తల్లి సెల్ ఫోన్ తీసుకుందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
Student Hanged Herself: బంగాల్ లోని బలూర్‌ఘాట్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. తన సెల్ ఫోన్ ను తల్లి తీసుకొని మందలించిందనే కారణంగ ఓ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Student Hanged Herself: పశ్చిమ బెంగాల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుందని గమనించిన ఓ తల్లి తన కూతుర్ని మందలించింది. దాంతో మనస్తాపం చెందిన ఆ బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
వెస్ట్ బెంగాల్ లోని బజ్ బజ్ మున్సిపాలిటీ పరిధిలోని బలూర్ ఘాట్ లో సుభాష్ మండల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అయ్యేందుకు తమ ముగ్గురు పిల్లలకు సెల్ ఫోన్స్ కొనిచ్చారు. ఆ సెల్ ఫోన్స్ సహాయంతోనే ఇన్ని రోజులు వాళ్లు ఆన్ లైన్ క్లాసులకు హజరయ్యారు. కొవిడ్ కేసులు క్రమంగా తగ్గడం వల్ల పశ్చిమ బెంగాల్ లోని పాఠశాలు ప్రారంభమయ్యాయి.
దీంతో సుభాష్ భార్య తన కుమార్తె దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను తీసుకుంది. ఎక్కువగా సెల్ ఫోన్ వాడినందుకు మందలించింది కూడా. అయితే అది తట్టుకోలేకపోయిన కుమార్తె.. తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ బాలిక మరిణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు
Also Read: బ్రేక్‌ఫాస్ట్‌లో 'చచ్చిన పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook