KFD: కర్ణాటకలో సరికొత్త వ్యాధి కలకలం రేపుతోంది. రోజురోజుకు ఆ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ఆస్పత్రిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆ వ్యాధి సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందడంతో భయాందోళన మొదలైంది. కర్ణాటకను వణికిస్తున్న వ్యాధి పేరు 'మంకీ ఫీవర్‌'. దీనికి క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసిస్‌ (కేఎఫ్‌డీ) అనే మరో పేరు ఉంది. ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి బాధితులు 25కు చేరారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chiranjeevi as Hanuman: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషం వేసిన ఈ సినిమా తెలుసా..


శివమొగ్గ జిల్లా హోసనగర తాలుకాకు చెందిన 18 ఏళ్ల యువతి, ఉడుపి జిల్లా మణపాల్‌కు చెందిన 79 ఏళ్ల వృద్ధుడు ఈ వ్యాధితో మృతిచెందారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ తెలిపారు. ఇప్పటివరకు 2,288 నమూనాలను పరీక్షించగా 48 మందికి మంకీ ఫీలర్‌ సోకిందని తేలింది. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కూడా తీవ్రరూపం దాల్చింది. నాడు 26 మంది మరణించారు.

Also Read: Taxi fare: ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఓలా, ఉబెర్‌లో ఫిక్స్‌డ్‌ రేట్లు.. ఎక్కడంటే?


మంకీ జ్వరం వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి ప్రపంచంలో మొదటగా దక్షిణాసియాలో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఈ వ్యాధి అటవీ ప్రాంతంలో విస్తరిస్తుంది. పక్షుల నుంచి మనుషులకు ఇది సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు డెంగీ మాదిరి ఉంటాయి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తుంటాయి. కోతుల్లో కనిపించే పేళ్లు మనుషులను కాటు వేయడం ద్వారా మానవులకు ఈ వ్యాధి సోకుతుంది.


'సిద్దపూర్‌ తాలుకాలో 21 మంది కేఎఫ్‌డీ బారిన పడ్డారు. తాజాగా మరో నలుగురికి కూడా ఈ వ్యాధి సోకింది. 12 రోజుల్లో మొత్తం 25 మందికి ఆ వ్యాధి వ్యాపించింది. వ్యాధిగ్రస్తులు మంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో, సిద్దాపూర్‌ తదితర ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఆ వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే కోలుకుంటారు. ఎవరి పరిస్థితి కూడా విషమంగా లేదు' అని ఉత్తర కన్నడ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ బీవీ నీరజ్‌తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook