భోపాల్: ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద్ సరస్వతి అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి జన్మస్థానంలో మసీదు ఉన్నట్లు ఉనికిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. 1992లో అయోధ్యలో కార్యకర్తలు కూల్చింది రామమందిరమే అని స్వరూపానంద స్వామి అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అయోధ్యలోని రామ జన్మస్థానంలో మసీదు ఉన్నట్లు ఎన్నడూ ఉనికిలో లేదు. కరసేవకులు కూల్చింది మసీదు కాదని.. అది మందిరమే' అని శంకరాచార్య మీడియాకు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే.. ఆ ప్రదేశంలో గొప్ప రామ మందిరంను పునర్నిర్మిస్తామని శంకరాచార్య పేర్కొన్నారు. 'నేను శంకరాచార్యుడిని. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత' అని అన్నారు.


అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదంపై తుది విచారణను 2017 డిసెంబర్ 5న సుప్రీంకోర్టు ప్రారంభించింది.