COVID-19 Hotspots: ఇంటింటి సర్వే.. బ్లడ్ శాంపిల్స్ సేకరణ
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ భూతం పలు మెట్రోపాలిటిన్ నగరాల్లో కోరలు చాస్తోంది. పొట్ట కూటి కోసం బతకొచ్చిన వలస కార్మికులు, నిత్యం రాకపోకలు సాగించే పర్యాటకులు, జన సాంద్రత అధికంగా ఉండే పెద్ద పెద్ద నగరాల్లో కరోనావైరస్ మరింత విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ, రాజస్తాన్ రాజధాని జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, పూణె నగరాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కోవిడ్19.ఇండియా.ఆర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని మహానగరాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.
1. ముంబై: 1756
2. ఢిల్లీ: 1561
3. జైపూర్: 468
4. ఇండోర్: 413
5. అహ్మదాబాద్: 404
6. పూణె: 351
7. థానె: 270
8. చెన్నై: 214
9. హైదరాబాద్: 197
10. కాసర్‌ఘడ్: 167
Also read : Rains in 2020: రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్
ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
(Source: Covid19india.org as on 15th April; 14:40)