Srinagar: మోస్ట్ వాంటెడ్ పాకిస్థానీ ఉగ్రవాది అబు జరారాను భారత భద్రతా దళాలు జమ్మూ-కశ్మీర్‌(Jammu Kashmir)లోని పూంచ్(Poonch)-రాజౌరీ సెక్టార్‌లో మట్టుబెట్టాయి. నిఘావర్గాల సమాచారంతో బెహ్రామ్‌గాలా ప్రాంతంలో కశ్మీర్‌ పోలీసులు, సైన్యం(Indian Army) చేపట్టిన ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించారని.. కానీ, ఎదురు కాల్పుల్లో జరారా మృతి చెందాడని, మరొకరు తప్పించుకున్నారని ఓ డిఫెన్స్‌ అధికారి వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాది వద్ద నుంచి ఒక ఏకే- 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాది(Terrorist)నీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 


Also Read: Rajnath Singh: 1971 నాటి యుద్ధ వీరుడి భార్య పాదాలకు నమస్కరించిన రాజ్‌నాథ్ సింగ్


 పాకిస్థాన్(Pakistan)లోని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అబు జరారా..కశ్మీర్‌లోని పిర్‌ పంజల్‌ దక్షిణ ప్రాంతంలో స్థానిక యువతను మిలిటెన్సీ వైపు ఆకర్షించడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి బాధ్యతలు అతనికి అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook