Rajnath Singh touches feet of PVC awardee’s wife: 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వీరులను స్మరించుకుని, గౌరవించుకునేందుకు స్వర్ణిం విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనాటి యుద్ధంలో దేశం విజయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కల్నల్ హోషియార్ సింగ్ భార్యను (Colonel Hoshiar Singh's wife Dhanno Devi) కలిసి పలకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆమె పాదాలకు నమస్కరించి వారి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. 1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం (1971 Indo-Pak war) పూర్తయి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టనున్న 50వ వార్షిక వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
బంగ్లాదేశ్‌కి విముక్తి ప్రసాదించిన 1971 నాటి భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో (India - Pakistan war) వీరుడిగా పేరు సంపాదించుకున్న కల్నల్ హోషియార్ సింగ్‌కి భారత ప్రభుత్వం పరమ వీర్ చక్ర పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే.
Defence Minister Rajnath Singh touched the feet of wife of Colonel Hoshiar Singh who was decorated with Param Vir Chakra for exhibiting exemplary courage in the 1971 war. The Defence Minister met her at Vijay Parv Samapan Samaroh in New Delhi today. pic.twitter.com/tjm9oakyKm
— ANI (@ANI) December 14, 2021
Also read : Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50మంది సజీవ దహనం, హైతీలో ఘటన
ఈ ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh speech) మాట్లాడుతూ.. అప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని న్యాయం కోసం జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. ఆ యుద్ధం వల్లే బంగ్లాదేశ్ పేరుతో ఓ కొత్త దేశం ఏర్పడిందని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్ పట్ల భారత్‌కి ఉన్న మానవతా దృక్పథాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.
Had a warm interaction with the Bangladeshi Muktijoddhas and the Indian war veterans who fought against injustice in 1971 war.
The Indian Armed Forces worked together with the courageous Muktijoddhas in their valiant struggle.#SwarnimVijayParv pic.twitter.com/R6LnbUzeZC
— Rajnath Singh (@rajnathsingh) December 14, 2021
Also read : Omicron variant: ఒమిక్రాన్ పేషెంట్స్ సంఖ్య, మరణాలు సంఖ్య పెరగొచ్చు.. WHO హెచ్చరికలు
డిసెంబర్ 16న భారత్ విజయ్ దివాస్ (December 16 Vijay Diwas) జరుపుకోనుంది. 1971 లో డిసెంబర్ 16 నాడే పాకిస్థాన్ ఆర్మీతో పాటు పాకిస్థాన్‌కి చెందిన 93 వేల మంది సైనిక బలగాలు భారత రక్షణ బలగాల ఎదుట లొంగిపోయాయి. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఎంతో నష్టపోయింది. పాకిస్థాన్ ఆర్మీలో (Pakistan Army) మూడో వంతు, నేవీ బలగాల్లో సగం మంది, ఎయిర్ ఫోర్స్ బలగాల్లో నాలుగో వంతు కోల్పోయిందని రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) గుర్తుచేసుకున్నారు.
सौगंध हमें इस मिट्टी की, हम देश नहीं झुकने देंगे!
आज दिल्ली में विजय पर्व के समापन समारोह में देश के विभिन्न इलाक़ों से लाई गई मिट्टी के मिश्रण को माथे से लगाया।
देश की एकता और अखंडता को अक्षुण्ण रखना हम सभी भारतीयों की ज़िम्मेदारी है। pic.twitter.com/QSP1gZZwlX
— Rajnath Singh (@rajnathsingh) December 14, 2021
Also read : Omicron cases in Maharashtra : మహారాష్ట్రలో మరో 8 ఒమిక్రాన్ కేసులు.. 28కి చేరిన కేసుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook