భోపాల్: కరోనా తెచ్చిన కష్టం బడుగులకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్(lockdown) కొనసాగుతోన్న నేపథ్యంలో నగరాల్లోని దినసరి కూలీలు దిక్కుతోచక రాత్రి రాత్రే సర్దుకొని తమ సొంత గ్రామాలకు బయల్దేరారు. రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిన ఈ క్రమంలో కాలినడకే తప్ప వేరే మార్గం లేదు. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన తొమ్మిది నెలల గర్భవతి 500 కిలో మీటర్లు నడిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దినసరి కూలీలు పనులు లేకపోవడంతో పాటు నగరాలలో ఉంటే వైరస్ సోకుతుందనే భయంతో గ్రామాలకు పయనమయ్యారు. ప్రజలకు వాహన సదుపాయం లేకపోవడంతో కాలినడకన వందల కిలో మీటర్లు ప్రయాణించి గమ్య స్థానాలను చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 24వ పుట్టిన రోజు వేడుకల్లో 'కర్ణాటక క్రష్' రష్మిక...


 ఉత్తరప్రదేశ్ లోని మథుర నుంచి మార్చి 29న కలిబాయ్ తన భర్త రామ్‌దీన్ కేవత్‌తో కలిసి నడక ప్రారంభించి మార్చి 31న యూపీ లోని పన్నా జిల్లా బరియాపూర్ భూమియాన్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకొని సరికి ఆమెకు నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవం ద్వారానే  బిడ్డకు జన్మనిచ్చిదని డాక్టర్ కెపి రాజ్‌పూట్ తెలిపారు. కలిబాయ్, పసిబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏప్రిల్2న మగబిడ్డ జన్మించడంతో రామ్ అని పేరు పెట్టుకున్నామని, శ్రీరామ నవమి ముందు రోజు బాబు జన్మించడంతో ఆ పేరు పెట్టామని తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 500 కీ మీ ల ప్రయాణంలో 220 కిలో మీటర్లు ట్రాక్టర్ లో ప్రయాణించడం ద్వారా చేరుకున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..