జగన్ పాదయాత్రకు `వర్గీకరణ` సెగ
జగన్ పాదయాత్రకు తొలి అడ్డంకి ఎదురైంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అగ్రహానికి చేరుకున్న జగన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ మద్దతు ఇచ్చే వరకు పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ జగన్ ను అడ్డుకున్నారు. జగన్ నోటి నుంచి స్పష్టమైన వైఖరి తెలిపే వరకు యాత్రను తాము సాగనివ్వబోమని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
జగన్ సిబ్బందితో వాగ్వాదం
పాదయాత్రను అడ్డుకోవడంతో జగన్ సిబ్బంది-ఎమ్మెర్పీఎస్ కార్యకర్తల మధ్య కాపేపు వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా ఆందోళనకారులను స్థానిక పోలీసుల సాయంతో చెదరగొట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మాట్లాడుతూ వర్గీకరణపై తప్పకుండా స్పందిస్తానని చెబుతూనే..ప్రజా సమస్యల కోసం చేస్తున్న తన యాత్రను అడ్డుకోవడం సబబు కాదని హితవు పలికారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ 94 రోజల నుంచి ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.