Bloomberg Billionaires Index: ముకేశ్ ఇప్పుడు నాలుగో స్థానంలో
ఇండియన్ బిజినెస్ మాయిస్ట్రో ముకేఖ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో మరో మెట్టు పైకెక్కారు. గతంలో ఆరేడు స్థానాల్లో ఉన్న ముకేష్ ఇప్పుడు నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు.
ఇండియన్ బిజినెస్ మాయిస్ట్రో రిలయన్స్ అధినేత ముకేఖ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో మరో మెట్టు పైకెక్కారు. గతంలో ఆరేడు స్థానాల్లో ఉన్న ముకేష్ ఇప్పుడు నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు.
బ్లూంబర్ల్ బిలియనీర్స్ ఇండెక్స్ ( Bloomberg Billionaires Index ) మరోసారి జాబితా విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల్లో ( World richest list ) ఇండియన్ బిజినెస్ దిగ్గజం, రిలయన్స్ ( Reliance ) అధినేత ముకేష్ అంబానీ ( Mukesh Ambani ) ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. బ్లూంబర్ల్ ఇండెక్స్ ప్రకారం 80.6 బిలియన్ డాలర్ల నికర ఆదాయంతో ఆయన నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితా ప్రకారం 187 బిలియన్ డాలర్లతో అమెజాన్ ( Amazon ) అధినేత జెఫ్ బెజోస్ తొలి స్థానంలో ఉన్నారు. 121 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ ( Microsoft ) రెండో స్థానంలోనూ, 102 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ ( Facebook ) మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటికే వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ఎలాన్ మస్క్ వంటి ప్రపంచ దనవంతుల్ని ముకేష్ అధిగమించారు. ముకేష్ అంబానీ తాజాగా కైవసం చేసుకున్న నాలుగో స్థానం నిన్నటి వరకూ లగ్జరీ వస్తువుల్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఎల్వీఎంహెచ్ సంస్థ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ది. Also read: August 15: కరోనా వారియర్లకు నివాళిగా..సారే జహాసే అచ్ఛా