Telangana CM KCR to attend Former UP CM Mulayam Singh Yadav funeral: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో దాదాపుగా 40 రోజుల పాటు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసి.. తన తండ్రి ములాయం మరణ వార్తను ధృవీకరించారు. ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ములాయం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ పని చేశారు. ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ములాయం ఆత్మకు శాంతి చేకూరని కోరుకుంటున్నా' అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు.



నేడు స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్‌కు మంగళవారం (అక్టోబర్ 11) మధ్యాహ్నం సీఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అదే రోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. 


Also Read: అనంతపద్మనాభ స్వామి కోనేరు మొసలి మృతి.. నివాళులర్పించేందుకు తరలివచ్చిన జనం!


Also Read: Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook