Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇప్పుడు తౌక్టే తుపాను(Tauktae Cyclone) తీవ్రంగా వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్బడిన తుపాను తీవ్ర తుపానుగా మారుతోంది. అతి తీవ్ర తుపానుగా మారి గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశముంది. తౌక్టే తుపాన్ పశ్చిమ తీర ప్రాంతాల్ని ఇప్పటికే అతలాకుతలం చేసేస్తోంది. ముంబైలో అయితే తుపాను భీభత్సమే సృష్టిస్తోంది. వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మూడు గంటల పాటు ముంబై ఎయిర్‌పోర్ట్‌ను (Mumbai Airport) మూసివేశారు. ఇప్పటి వరకూ 12 వేల 420 మందిని తీర ప్రాంతాల్నించి సురక్షింత ప్రాంతాలకు తరలించారు. తౌక్టే తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితి మరింతగా విషమించే అవకాశాలున్నందున అధికారులు అప్రమత్తమవుతున్నారు. గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో తీరప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలో దించారు. 


అటు కేరళలోనూ తౌక్టే తుఫాన్‌ బీభత్సం సృస్టిస్తోంది. ముఖ్యంగా 9 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావం ఎక్కువగా వుంది. ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని 7 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావం ఎక్కువగా వుంది. ఉడుపి నాడా ప్రాంతంలో 38.5 సెం.మీ వర్షపాతం  నమోదైంది. గోవాను తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారీ ఈదురుగాలులతో వర‍్షాలు పడుతున్నాయి.


Also read: Cow urine రోజూ సేవిస్తా.. అందుకే నాకు Corona రాలేదు: BJP MP Pragya Thakur


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook