Mumbai CoronaVirus Death Toll: ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు
CoronaVirus Deaths in Mumbai | శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో ముంబైలో 50కి పైగా బాధితులు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి ముంబైలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 10 వేలు దాటింది.
ముంబై: కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి భారత్‌లో అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 16,38,961కు చేరింది. తాజాగా 6,417 కోవిడ్19 (COVID-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మహారాష్ట్రలో ఒక్కరోజులో 137 కరోనా మరణాలు తాజాగా సంభవించడం ఆందోళన పెంచుతోంది. దీంతో మహారాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 43,152కు చేరుకుందని వైద్యశాఖ హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది.
తాజాగా 10,004 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మహారాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,55,107కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,40,194 యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో ఒక్కరోజులో 1,257 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 2,50,059కి చేరింది.
ముంబైలోనే 10 వేల కరోనా మరణాలు
శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో ముంబైలో 50కి పైగా బాధితులు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి ముంబైలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య (CoronaVirus Deaths in Mumbai) 10 వేలు దాటింది. ముంబైలో కరోనాతో పోరాడుతూ మొత్తం 10,059 మంది మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 85,48,036 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పుణే, కొల్హాపూర్ డివిజన్లలో సైతం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని హెల్త్ బులెటిన్‌లో వైద్యశాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe