Daughter In Law: కోడలి తిక్క కుదిరింది.. కొడుకు తన తల్లిని సంరక్షించుకుంటే గృహహింసనా? ఇదేం విడ్డూరం
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Husband Spending Time Money To Mother: ఆడోళ్లకు ఆడోళ్లే శత్రువు అని ఉత్తిపుణ్యానికి అనరు. అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ పోరు నడుస్తూనే ఉంటుంది. వీరిద్దరి మధ్య భర్త నలిగిపోతుంటాడు. తాజాగా ఇలాంటి పరిణామమే ఎదురైంది. అయితే తన అత్త కోసం తన భర్త సమయం కేటాయిస్తున్నాడని, డబ్బులు ఇస్తూ పోషిస్తుండడాన్ని ఓ కోడలు తట్టుకోలేకపోయింది. తన తల్లిని సంరక్షించుకోవడం సరికాదని ఆమె నిత్యం భర్తతో గొడవపడింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా విసిగిపోయిన భార్య కోర్టును ఆశ్రయించింది.
తమకు నిరంతరం అస్త్రంగా ఉండే 'గృహహింస' కేసు కింద ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కోడలికి చీవాట్లు పెట్టింది. ఆమె వక్రబుద్ధిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కొడుకు తన సొంత తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇచ్చి పోషించడం ఎలా గృహహింస కిందకు వస్తుందని నిలదీసింది. 'తల్లి సంరక్షణ, ఆమె యోగక్షేమాలు చూసుకోవడం అతడి బాధ్యత. ఇది అసలు గృహహింస కేసు కానే కాదు' అని స్పష్టం చేస్తూ ఆ కేసును కొట్టివేసింది. అత్త, భర్తపై పెత్తనం చేయాలని చూసిన ఆమెకు కోర్టు బుద్ధి చెప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Delhi Rikshawala: రిక్షావాలా అని తక్కువ చూడొద్దు డూడ్.. ఇంగ్లీష్ వింటే నోరెళ్లబెడతారు
మహారాష్ట్ర సచివాలయంలో ఓ మహిళా ఉద్యోగి పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్లు. 1993లో ఆమెకు వివాహమైంది. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య కలహాలు పొడచూపాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఆమెకు డబ్బులు పంపిస్తూనే అతడు తన తల్లి కోసం కూడా నెలకు రూ.10 వేలు నెలనెలా పంపుతున్నాడు. 2004 దాకా విదేశాల్లో ఉన్న ఆయన స్వదేశం చేరుకుని భార్యతోనే కలిసి ఉంటున్నాడు. దాంతోపాటు తల్లితో సమయం గడుపుతున్నాడు. తల్లి యోగక్షేమాలు కనుక్కుంటూ ఆమె ఆర్థిక అవసరాలు కూడా తీరుస్తున్నాడు. ఇది భార్యకు నచ్చలేదు.
Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!
చాలాసార్లు భార్యాభర్తల మధ్య ఈ విషయమై గొడవలు జరిగాయి. అయితే భార్యతో ఘర్షణ పడలేక అతడు నరకం అనుభవించాడు. ఈ బాధలు పడలేక మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అత్త, భర్త విషయమై ఆమె 2015లో కోర్టుకు వెళ్లింది. కేసు విన్న మెజిస్ట్రేట్ ఆమె చెప్పిన వాదనను విని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్తపై గృహహింస కేసు పెట్టింది. వాయిదాలతో విచారణ జరిగిన ఈ పిటిషన్‌పై ముంబై ఫ్యామిలీ కోర్టు మంగళవారం తుది విచారణ చేపట్టింది. అనంతరం మహిళ వాదనలు విన్న న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'నా భర్త తన తల్లితో ఎక్కువ సేపు సమయం గడుపుతున్నాడు. అంతేకాదు డబ్బులు ఇస్తూ ఆమె యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. ఇది గృహహింస కిందకే వస్తుంది. నాకు న్యాయం చేయాలి' అని ఆ మహిళ వాదించింది. మహిళ వాదనను విన్న న్యాయమూర్తి అసహ్యించుకున్నారు. 'ఇదెలా గృహహింస కిందకు వస్తుంది. తల్లితో సమయం గడపడం, ఆమె యోగక్షేమాలు కనుక్కోవడం అతడి బాధ్యత' అని స్పష్టం చేస్తూ సదరు మహిళ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆమెకు బుద్ధి వచ్చేలా అత్తకు నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు మహారాష్ట్రలో చర్చనీయాంశమైంది. కోడలి తిక్క కుదిరిందని వార్త విన్నవాళ్లు చెబుతున్నారు. తల్లిని చూసుకోవడం కూడా గృహహింసనా నువ్వు మహానుభావురాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గృహహింస కేసును అడ్డం పెట్టుకుని మహిళలు సాగిస్తున్న అరాచకాలకు ఇది ఒక నిదర్శనమని మరికొందరు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook