Defamation case on Arnab: రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. వేధింపులు, బలవంతం, చీటింగ్, లంచం వంటి కేసులు ఇప్పటికే అర్నాబ్ గోస్వామిపై ఉన్నాయి. ఇప్పుడు పరువు నష్టం కేసు వచ్చి పడింది. అర్నాబ్ గోస్వామి, అతని భార్యపై ఓ పోలీసు అధికారి పరువు నష్టం దావా వేయడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ ( Bollywood ) నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant singh rajput ) అనుమానాస్పద మృతి వ్యవహారంలో రిపబ్లిక్ టీవీ ( Republic tv ) అధినేత అర్నాబ్ గోస్వామి ( Arnab goswami ) విభిన్న రకాలైన కధనాలు ప్రసారం చేశారు. ఆ కథనాల్లో ముంబై పోలీసుల్ని టార్గెట్ చేశారు. ఈ కథనాల ఆధారంగా ముంబై జోన్ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే..అర్నాబ్ గోస్వామి ( Arnab Goswami ), అతని భార్యపై పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు వేశానని ముంబై డీసీపీ ( Mumbai Dcp ) అభిషేక్ తెలిపారు. మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఈ కేసు దాఖలు చేసినట్టు చెప్పారు.


Also read: Assembly Elections: ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook