Mother and baby die after delivery using phone torch in mumbai bmc hospital: మనలో చాలా మంది దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడంటారు. అందుకు వైద్యుడిని దేవుడిలా భావిస్తారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి కొందరు పాడుపనులు చేస్తుంటారు. ఆ వృత్తికి కళంకం వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. కొందరు వైద్యులు.. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారిని ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేసి రోగానికి సరైన మందులు ఇస్తుంటారు. కానీ మరికొందరు తమ పనిపట్ల పూర్తిగా నెగ్లీజెన్సీగా ఉంటారు. బాధితులను లైంగికంగా వేధిస్తుంటారు. బాధితులతో పాటు ఆస్పత్రిలో ఉండే బంధువులను లైంగికంగా వేధిస్తుంటారు. కొందరు రోగికి సరైన విధంగా సర్జరీలు చేయడంలో అజాగ్రత్తగా వ్యవహారిస్తారు. కడుపులో కాటన్ మర్చిపోవడం,కత్తెరలు మర్చిపోయిన ఘటనలు అనేకం గతంలో వార్తలలో నిలిచాయి. కొందరు వైద్యులు ఇలాంటి పనులు చేయడం వల్ల అందరికి చెడ్డపేరు వస్తుంది. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..


పూర్తి వివరాలు.. 


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే ఖుస్రుద్దీన్ అన్సారీ, షాహిదున్‌తో 11 నెలల కిందటే పెళ్లి జరిగింది. ఖుస్రుద్దీన్ అన్సారీ ఒక దివ్యాంగుడు. కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బాధితుల ప్రకారం..  ఏప్రిల్ 29 న ఖుస్రుద్దీన్ అన్సారీ భార్యకు పురిటినొప్పలు రావడంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోమ్‌కు ఉదయం 7 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. అయితే.. మహిళను టెస్టులు చేసిన వైద్యులు సాధారణ కాన్పూ అవుతుందని చెప్పారు. డాక్టర్ల సలహా ప్రకారం  ఖుస్రుద్దీన్ కుటుంబం వేచిచూస్తున్నారు. ఇంతలో రాత్రి అయ్యే సరికి వైద్యులు ఒక్కసారిగా హడావిడీ చేశారు. అంతేకాకుండా అర్జంట్ గా  సిజెరియన్ చేయాలని చెప్పారు. అప్పటికే ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు డాక్టర్లు.. టార్చ్ లైట్ వెలుతురులో మహిళకు సిజేరియన్ చేయాలని తమ వద్ద సంతకాలు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. పలుమార్లు తాము జనరేటర్ ఆన్ చేయాలని వేడుకున్న ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని, చివరకు మహిళకు సిజేరియన్ చేశారు. కాసేపటికి బైటకు వచ్చి, శిశువు మరణించినట్లు చెప్పారు.


తల్లిబాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆతర్వాత బాధిత కుటుంబం ఆస్పత్రిలో గదిలోపలికి వెళ్లి చూసేసరిగా మహిళ తీవ్ర రక్తస్రావంతో ఉంది. రూమ్ లో లైట్ లేదు. కేవలం ఫోన్ చార్జీంగ్ వెలుతురులో ఆపరేషన్ చేశారు. మహిళ ఏమాత్రం ఉలుకు పలుకులేకపోవడంతో వైద్యులు హడావిడీ చేసి సియోన్ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధితులు అక్కడిక గాబారాగా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లేసరికి మహిళ చనిపోయిందని అక్కడి వైద్యులు తెల్చేశారు. దీంతో తమను కావాలాని ఇలా ఆస్పత్రి నుంచి వెళ్లేలా చేశారని బాధితు కుటుంబం ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. తొలుత నార్మల్ డెలీవరీ అవుతుందని చెప్పి, ఫోన్ టార్చ్ వెలుతురులో ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డలను కూడా వైద్యులు పొట్టనపెట్టుకున్నారంటూ బాధితులు కన్నీటి పర్యంతమౌతున్నారు.


Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..


ఈ క్రమంలో సంఘటన స్థలానికిచేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అన్సారీ తల్లి మాట్లాడుతూ..  తమ కోడలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని, ఆమెకు నార్మల్ డెలీవరీ అవుతుందని చెప్పి, పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం ఆస్పత్రిలో ఆక్సిజన్ సైతం అందుబాటులో లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోడలు, శిశువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి.. వాళ్ల ప్రాణాలు పోవడానికి బాద్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్సారీ కుటుంబం డిమాండ్ చేస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter