ముంబై: భారీ వర్షాలతో ముంబై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తుతుండగా రానున్న మరో 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని రోడ్లపైకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. 


ఇదిలావుంటే, వర్షాల కారణంగా ముంబై కేంద్రంగా రాకపోకలు సాగించే 17 విమానాలను దారి మళ్లించగా ఇంకొన్ని విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. లోకల్ రైళ్లతోపాటు అనేక మార్లాల్లో ముంబై సబర్బన్ బస్సు సర్వీసులను దారి మళ్లించారు.