Corona Update: దేశంలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో (Corona in India) పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో తీవ్రత అధికంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబయిలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు..


మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా తీవ్రరూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నగరంలో 6,347 కొవిడ్ కేసులు వెలుగు చుశాయి. ఒకరు కొవిడ్​తో మరణించారు. డిసెంబర్ 31న ముంబయిలో 5,631 కరోనా కేసులు నమోదవడం (Corona cases in Mumbai) గమనార్హం.


ఒక్క ముంబయిలోనే 22,334 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నట్లు ముంబయి మున్సిపల్ విభాగం​ వెల్లడించింది. న్యూ ఇయర్​ సెలెబ్రేషన్స్​పై నిషేధం విధించిన, కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు చేపట్టినా ముంబయిలో కేసులు ఈ స్థాయిలో పెరుగుతుండటం ఆందోళనకరమైన విషయం.



ఢిల్లీలో 51 శాతం పెరిగిన కేసులు..


ఢిల్లీలో కూడా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 2,716 మందికి పాజిటివ్​గా తేలింది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు 51 శాతం పెరిగాయి. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 3,360 యాక్టివ్ కేసులు (Corona cases in Delhi) ఉన్నాయి.


కేరళలో 22 మంది కొవిడ్​కు బలి


కేరళలో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు 2,435 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 22 మంది కరోనాతో మృతి చెందినట్లు తెలిపింది. ఇక రాష్ట్రంలో మొత్తం 18,904 యాక్టివ్​ కేసులు (Corona cases in Kerala) ఉన్నట్లు వివరించింది.


కర్ణాటకలో ఇలా..


కర్ణాటకలో కరోనా కేసులు మరోసారి వెయ్యి దాటాయి. కొత్తగా 1,033 పాజిటివ్​ కేసులు (Corona cases in Karnataka) నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. యాక్టివ్​ కేసులు 9,386కు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 38,340 మంది కొవిడ్​ కారణంగా మృతి చెందారు.


వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. వీటికి తోడు ఒమిక్రాన్​ వేరియంట్​ (Omicron fears in India) భయాలు దేశంలో థార్డ్​వేవ్ సంకేతాలకు ఊతమందిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.


Also read: Covid new symptoms : ఈ లక్షణాలు ఉంటే కరోనా అని గుర్తుంచుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు


Also read: Haryana Landslide : మైనింగ్ క్వారీలో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద చాలా వాహ‌నాలు, పలువురి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook