Asaduddin Owaisi: ముస్లింల సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ కౌంటర్‌ ఇచ్చారు. అత్యధికంగా ముస్లింలే కండోమ్‌లు వినియోగిస్తున్నారని స్పష్టం చేశారు. కానీ అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌ కుటుంబంలో ఎంతమంది పిల్లలని ప్రశ్నించారు. వారి కుటుంబంలో డజన్ల కొద్ది ఉన్నారని చెప్పారు. ముస్లింలు జనాభా నియంత్రణ పాటిస్తున్నారని వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన


లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన సొంత హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ 'ముస్లింలకు ఎక్కువ సంతానం' అనే వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ స్పందించారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని అసద్‌ వివరించారు. కానీ హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు నరేంద్ర మోదీ విద్వేషాన్ని పెంచుతున్నారని తెలిపారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరని పేర్కొన్నారు. 17 కోట్ల భారతీయ ముస్లింలను మోదీ చొరబాటుదారులని పిలిచారని గుర్తు చేశారు. దళితులు, ముస్లింల పట్ల ద్వేషం మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. సమాజంలో ముస్లిం పురుషులు అత్యధికంగా కండోమ్‌లు వినియోగిస్తున్నారు అని అసదుద్దీన్‌ తెలిపారు.

Also Read: Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి


 


హైదరాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై అసదుద్దీన్‌ విమర్శలు చేశారు. ప్రచారంలో మాధవీలత బాణం వేసినట్లు స్టిల్‌ ఇవ్వడంపై స్పందిస్తూ 'ఇది మసీదుపై బాణం వేయడం కాదు. హైదరాబాద్‌లో శాంతిని నాశనం చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నం అది' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter