మా నాన్నే నా హీరో.. బెస్ట్ ఫ్రెండ్... లిద్దర్ శవపేటిక వద్ద కన్నీటిపర్యంతమైన కుమార్తె
Tearful farewell to Brigadier LS Lidder: అశ్రు నయనాల మధ్య బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాల సమయంలో ఆయన సతీమణి, కుమార్తె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Tearful farewell to Brigadier LS Lidder: తమిళనాడు (Tamilnadu) హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్ (Lakhwinder Singh Lidder) అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ శ్మశాన వాటికలో ముగిశాయి. కుమార్తె ఆస్నా తండ్రి లఖ్వీందర్ సింగ్ లిద్దర్‌కు దహన సంస్కారాలు నిర్వహించారు. లఖ్వీందర్ భార్య గీతిక, కుమార్తె ఆస్నా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. జాతీయ జెండా కప్పి వున్న లఖ్వీందర్ సింగ్ శవపేటికను భార్య గీతిక ముద్దాడిన దృశ్యం ప్రతీ ఒక్కరి మనసులను కలచివేసింది. పొంగి వస్తున్న దు:ఖాన్ని అణుచుకుంటూనే... తన భర్తను నవ్వుతూ సాగనంపాలని ఆమె పేర్కొనడం అందరి కళ్లు చెమర్చేలా చేసింది.
కుమార్తె ఆస్నా (LS Lidder's Daughter) తండ్రికి నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆస్నా మాట్లాడుతూ... 'నేనిప్పుడు 17వ వడిలోకి అడుగుపెట్టబోతున్నాను. ఈ 17 ఏళ్ల కాలం నా తండ్రి మా వెంట ఉన్నారు. ఇకపై ఆ సంతోషకర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ముందుకు సాగుతాం. దేశం ఆయన్ను కోల్పోయింది. మా నాన్నే నా హీరో... నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నాకు అతిపెద్ద మోటివేటర్.' అంటూ కంటతడి పెట్టుకున్నారు.
లఖ్వీందర్ సింగ్ లిద్దర్ (LS Lidder Funeral) శవపేటికపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆర్మీ అధికారులు (Indian Army) ఆయన సతీమణి గీతికకు (LS Lidder's Wife) అప్పగించారు. ఈ సందర్భంగా గీతిక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భర్త చివరి గుర్తుగా మిగిలిన పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అయినప్పటికీ.. భర్తకు నవ్వుతూ చివరి వీడ్కోలు పలకాలని ఆమె చెప్పడం అందరి హృదయాలను ద్రవింపజేసింది. 'ఆయనకు మనం మంచి వీడ్కోలు పలకాలి... నవ్వుతూ సాగనంపాలి... నేనొక సైనికుడి భార్యను... ఇది పూడ్చలేని నష్టం...' అని దు:ఖశీలిన గొంతుతో ఆమె చెప్పుకొచ్చారు.
అంతకుముందు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లిద్దర్ శవపేటికపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు.
కాగా, రెండు రోజుల క్రితం తమిళనాడులోని కూనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (Helicopter Crash in Tamilnadu) త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ పైలెట్ గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారు సజీవదహనమయ్యారు.
Also Read: Viral Video: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సర్పాల సయ్యాట-ఒకదానికొకటి పెనవేసుకుని...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook