‌NABARD Recruitment 2024: బ్యాంకు ఉద్యోగం పొందాలనేది మీ కల. కేవలం పదో తరగతి పాసైతే చాలు మీకు బంపర్‌ ఆఫర్. నిరుద్యోగులకు ఇది బిగ్‌ ఆఫర్. కేంద్ర ప్రభుత్య ఉద్యోగం పొందే అరుదైన అవకాశం.  నేడు అక్టోబర్‌ 2 నుంచి నాబార్డ్‌ ఆఫీస్ అసిస్టెంట్‌ రిక్రూట్మెంట్‌ మొదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 అక్టోబర్‌ 21. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ క్షుణ్నంగా పరిశీలించాలి. ఆ తర్వాతే అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ నేటి నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ పరీక్ష నవంబర్‌ 21న నిర్వహించనున్నారు.


అర్హత..
నాబార్డ్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదవ తరగతి పాసై ఉండాలి. గ్రాడ్యూయేట్‌ చదివిన వారు అర్హులు కాదు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లు కూడా పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు కనీసం 15 ఏళ్లు ఇండియన్‌ ఆర్మీలో పనిచేసి ఉండాలి.


ఇదీ చదవండి: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..


వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1994 అక్టోబర్‌ 2 నుంచి 2006 అక్టోబర్‌ 1 మధ్య పుట్టి ఉండాలి.


ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఓబీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ గవర్నమెంట్‌ నార్మ్ వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ, విడో, డైవర్సీ ఉమెన్‌ పదేళ్ల రిల్యాక్సేషన్‌ లభిస్తుంది.


ఇదీ చదవండి: సామంత్‌తో రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన అనామిక.. ఆవేశపడకు అంబుజాక్షి అవార్డు ఎవరిని వరించిందో తేలిపోయిందిగా..!


నాబార్డ్‌కు దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు www.nabard.org/career అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై ఆన్‌లైన్‌ లింక్‌ పై క్లిక్‌ చేయాలి
ఆ తర్వాత మీ పేరు, కాంటాక్ట్‌ వివరాలు, ఇమెయిల్‌ ఐడీ, ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్వర్డ్‌ మీ ఇమెయిల్‌కు జనరేట్‌ అవుతుంది.
సేవ్‌ అండ్‌ నెక్ట్స్‌ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే అప్లికేషన్‌ సేవ్‌ అవుతుంది.
ఇప్పుడు మీరు నమోదు చేసిన వివరాలు మరోసారి వెరిఫై చేసుకోవచ్చు. ఏమైనా మార్పులు కావాలంటే చేంజ్‌ప చేసుకోవచ్చు. చివరగా కంప్లీట్‌ రిజిస్ట్రేషన్ పై క్లిక్‌ చేయాలి.


మీ పేరు, కుటుంబసభ్యుల పేరులో అక్షరదోషాలు ఉంటే ఓసారి సరి చూసుకోండి.
ఆ తర్వాత ఫోట్, సిగ్నేచర్‌ కూడా అప్లోడ్‌ చేయాలి. పేమెంట్‌ చేసి చివరగా సబ్మిట్‌ బట్టన్ పై క్లిక్ చేయాలి.
ఈ పోస్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నాబార్డ్‌ వెబ్‌సైట్‌ గ్రూప్‌ సీ రిక్రూట్మెంట్‌కు అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://www.nabard.org/ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా నేరుగా పూర్తి సమాచారం పొందవచ్చు.