NABARD Assistant Manager Jobs: నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ NABARD ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మీక్కూడా ఆసక్తి  ఉంటే వెంటనే అప్లై చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NABARD Recruitment 2024 నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్ ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకై దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్ధులు అధికారిక పోర్టల్ nabard.org ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు రెక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి. 


నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఈ పోస్టు కోసం వేర్వేరు టెక్నికల్ అర్హతల్ని కూడా నిర్ధారించింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలుంటాయి. ఈ పోస్టులకు కావల్సిన వయస్సు అర్హత గురించి పరిశీలిస్తే 2024 జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. అంటే అర్హత కలిగిన అభ్యర్ధి 1994 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య పుట్టి ఉండాలి. రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది. 


ఎంపికైన అభ్యర్ధులకు జీతం 44,500 రూపాయలు ఉంటుంది. మొత్తం 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జూలై 27న ప్రారంభమైంది. ఆగస్టు 15 చివరి తేదీగా ఉంది. ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు 150  రూపాయలు మాత్రమే. ఇక జనరల్ కేటగరీ విద్యార్ధులు 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పీజు రిఫండ్ ఉండదు.


నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపిక నాలుగు దశల్లో ఉంటుంది. ప్రాధమిక పరీక్ష, మెయిన్స్, సైకో మెట్రిక్ , ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రాధమిక పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రెండు గంటల సమయం ఉంటుంది. ఇక మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 210 నిమిషాల సమయం ఉంటుంది. సైకో మెట్రిక్ పరీక్ష 90 నిమిషాలుంటుంది. ఇక చివరిగా ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ప్రాధమిక పరీక్ష సెప్టెంబర్ 1న ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. నాబార్డ్ పోర్టల్ నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also read: Wayanad landslide: భారీ వర్షాలతో పట్టాలపై వరద నీరు, త్రిశూర్, జనశతాబ్ది, గురువాయూర్ రైళ్లు రద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook