Assam: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన అస్సాం(Assam)లోని నౌగావ్‌ జిల్లా సెంట్రల్ జైలు (Nagaon Central Jail)లో చోటుచేసుకుంది. గత నెలలో ఇక్కడి ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 85 మంది ఫలితాలు పాజిటివ్(HIV positive) గా వచ్చాయి. ఈ స్థాయిలో వైరస్‌ సోకడంపై అధికారులు విస్తుపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు


అయితే హెచ్‌ఐవీ సోకిన ఖైదీలంతా(inmates) డ్రగ్స్‌కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలు(Drugs) తీసుకొనేటపుడు వాడే సిరంజిల కారణంగానే ఈ స్థాయిలో పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వైద్యుల నివేదికను కారాగార అధికారులు కూడా ధ్రువీకరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి