తమిళనాడు కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ఇన్‌‌‌చార్జ్ గా వ్యవహరిస్తున్న నటి నగ్మా ఉద్వాసనకు గురయ్యారు. ఆమెను ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీ రాణిని లెక్క  చేయక పోవడం కారణంగా ఆమెను తప్పించాలని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పైగా తమిళనాడు కాంగ్రెస్ లో యాక్టివ్ పనిచేస్తున్న సహచర నటి కుష్బూ కూడా నగ్మా తొలగింపును  సమర్ధిస్తున్నారు. ఎందుకంటే నగ్మా అంటే కుష్బూకు గిట్టదట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏది ఏమైనా ..తాజా పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఆ బాధ్యతల నుంచి తొలగించేందుకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు దిగుమతై అక్కడే స్థిరపడిన నగ్మాకు రాష్ట్ర ఇన్‌‌‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే తమిళనాట  కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరు కారణంగా ఆమెను పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందన్న మాట. అయితే ఫేస్ గ్లామర్ ఉన్న నగ్మాకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది వేచిచూడాల్సిందే.