Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డును సాధించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ ఘనతను సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
PM Modi makes another record: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డును సాధించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ ఘనతను సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశంలో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ( Narendra Modi ) నిలిచారు. ప్రధానమంత్రిగా ఏన్డీఏ నుంచి నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి 2020 ఆగస్టు 14 నాటికి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టి 2,273 రోజులు పూర్తయింది. ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) మొత్తం 2,268 రోజులు పనిచేయగా.. ఆయన కంటే.. సుధీర్ఘకాలం కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ పనిచేసి రికార్డు
నెలకొల్పారు. ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించిన వారిలో మోదీ ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉన్నారు. Also read: Nepotism: Sadak 2 ట్రైలర్‌కు 8మిలియన్ల డిస్‌లైక్‌లు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అత్యధిక కాలం ప్రధానమంత్రులుగా సేవలందించిన వారిలో కాంగ్రెస్ ( Congress ) నుంచి జవహర్ లాల్ నెహ్రూ ( Jawaharlal Nehru ) మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ (Indira Gandhi), మూడవ స్థానంలో మన్‌మోహన్ సింగ్ (Manmohan Singh) ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ నాలుగవ స్థానంలో ఉండగా.. వాజ్‌పేయి ఐదవ స్థానంలో ఉన్నారు. వీరిద్దరు బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించారు. Also read: Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు: అభిజీత్ ముఖర్జీ