Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు: అభిజీత్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) చనిపోయినట్టుగా వస్తున్న తప్పుడు కథనాలను ( Fake news ) ఆయన కుమారుడు అభిజీత్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు.

Last Updated : Aug 13, 2020, 11:03 AM IST
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు అనే వదంతులపై ఘాటుగా స్పందించిన ఆయన కుమారుడు అభిజీత్ ముఖర్జి.
  • దేశంలో మీడియా ఇండస్ట్రీ మొత్తం ఫేక్ న్యూస్ కర్మాగారంగా తయారైందని ఆగ్రహం
  • ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మరో ట్వీట్ చేసిన అభిజీత్ ముఖర్జీ
Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు: అభిజీత్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) చనిపోయినట్టుగా వస్తున్న తప్పుడు కథనాలను ( Fake news ) ఆయన కుమారుడు అభిజీత్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఇంకా బతికే ఉన్నారని ట్విటర్ ద్వారా వెల్లడించిన అభిజీత్ ముఖర్జీ ( Abhijit Mukherjee ).. ప్రముఖ పాత్రికేయులు కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపించేలా చేయడం చూస్తోంటే ఇండియాలో మీడియా ఒక ఫేక్ న్యూస్ తయారు చేసే కర్మాగారంగా తయారైందని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతానికి హీమోడైనమికల్లీ స్టేబుల్‌గా ( Haemodynamically stable - గుండె నుంచి ఇతర రక్తనాళాల్లోకి బ్లడ్ పంపింగ్ ప్రక్రియ సాధారణంగా ఉండటం ) ఉందని ఆయన మరోసారి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read : Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఇక లేరని వదంతులు వ్యాప్తి

 

ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వాళ్లంతా వారి ప్రార్థనలు కొనసాగించాలని కోరుకుంటూ అభిజీత్ ముఖర్జీ బుధవారం సాయంత్రం కూడా ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

 

తీవ్ర అస్వస్థతతో ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో ( Army's Research and Referral Hospital ) చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని గుర్తించి అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి ప్రణబ్ వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ( Pranab Mukherjee's health condition ) విషమంగానే ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు స్పష్టంచేశారు. ప్రణబ్ ముఖర్జీ కరోనావైరస్‌తో బాధపడుతుండటం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ఓ కారణమైనట్టు తెలుస్తోంది. Also read : MS Dhoni: ధోని మరో రెండేళ్లు ఆడతాడు

Trending News