2017 సంవత్సరానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీ 'మోస్ట్ ట్వీటేడ్ అబౌట్ వరల్డ్ లీడర్' జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరువాతి స్థానంలో నిలిచారు. ఈ మేరకు ట్విట్టర్ మంగళవారం తెలిపింది. అలాగే మోదీ భారతదేశంలో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగి అగ్రస్థానంలో నిలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్ రిపోర్ట్ ల ప్రకారం .. ప్రధాని మోదీకి 2016లో 24.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండేవారు.  కానీ ఆ సంఖ్య 2017 డిసెంబర్ 4 నాటికి 37.5కు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44.1 మిలియన్ ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో.. మోదీ 37.5 మిలియన్ ఫాలోవర్స్ తో జాబితాలో రెండో స్థానంలో నిలిచారు అని ట్విట్టర్ తెలిపింది. 



 


టాప్ 10 లో చోటు దక్కించుకున్న ఇతర ప్రముఖులు  


వెనిజులాకు చెందిన నికోలస్ మదురో, టర్కీకి చెందిన రెసెప్ టయిప్ ఎర్డోగాన్, ఫ్రాన్స్ నుంచి ఇమ్మాన్యూల్ మాక్రోన్, మెక్సికో నుంచి ఎన్రిక్ పెన నీటో, అర్జెంటీనాకు చెందిన మౌరిప్ మెక్రి, బ్రిటన్ కు చెందిన తెరెసా మే, కొలంబియాకు చెందిన జువాన్ మాన్యువల్ సాంటోస్, ఇండోనేషియా కు చెందిన  అకున్ రెస్మి జోకో విడో


2017 టాప్ త్రీ మోస్ట్ లైక్డ్ ట్వీట్స్'లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన రెండు పోస్టు లు ఉన్నాయి. శరీరం రంగు, నేపథ్యం, మతం ఆధారంగా మరో వ్యక్తిని ద్వేషించరాదంటూ ఒబామా చేసిన రీట్వీటెడ్ ట్వీట్ రెండవ స్థానంలో నిలిచింది.