PM Narendra Modi pays tributes to Birsa Munda: న్యూఢిల్లీ: బీహార్‌ దివగంత గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంపాటు సామాజిక సామరస్యానికి భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి ఎనలేనిదని మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు ఈ రోజు జార్ఖండ్‌ అవతరణ దినోత్సవం (Jharkhand foundation day)  సందర్భంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి బిర్సా ముండా ఎనలేని కృషి చేశారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషి.. సామాజిక సామరస్యం కోసం బిర్సా ముండా చేసిన పోరాటం దేశవాసులకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని మోదీ ట్విట్టర్‌లో రాశారు. Also read: #WATCH: -20 డిగ్రీల చలిలో.. జవాన్ల దీపావళి వేడుకలు


అయితే గిరిజన తెగకు చెందిన బిర్సా ముండా 1875 నవంబర్‌ 15న బీహార్‌లో జన్మించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాడారు. బీహార్, జార్ఖాండ్ ప్రాంతాల్లో గిరిజన జాతి పరమైన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించి.. 25 సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయుల చేతిలో మరణించారు. 


Also read: Telangana: గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe