Corona Fourth Wave: దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రమాద ఘంటికలు ప్రారంభం కానున్నాయా..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఆ భయమే వెంటాడుతోంది. స్కూల్స్ మూతపడ్డాయి. రోజుకు కొత్తగా 5 వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా సంక్రమణ భయం వెంటాడుతోంది. ఇప్పటికే 64 మంది చిన్నారులు వివిధ స్కూల్స్ నుంచి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో..స్కూల్స్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా గత 24 గంటల్లో 5 వందలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. ఆదివారం ఢిల్లీలో కొత్తగా 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు అంటే శనివారం కంటే 57 కేసులెక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఇప్పుడు 4.21కు చేరుకుందని ఢిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.


ఢిల్లీ మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 68 వేల 550కు చేరుకున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది. గురువారం నాడు ఢిల్లీలో 325 కొత్త కేసులు నమోదు కాగా, శుక్రవారం నాడు 366 కేసులు నమోదయ్యాయి. ఇక శనివారం నాడు 461 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


ఢిల్లీ ఆసుపత్రుల్లో పరిస్థితి


ఢిల్లీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 9 వేల 662 బెడ్స్ కోవిడ్ రోగుల కోసం ఉన్నాయి. మరోవైపు 9 వేల 156 కోవిడ్19 ఆక్సిజన్ బెడ్స్, 2 వేల 174 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇక 1246 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 964 మంది కోవిడ్ 19 రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా సంక్రమణ నేపధ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏప్రిల్ 20న సమావేశం కానుంది. ఈ సమావేశంలో తీసుకోవల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పబ్లిక్ స్థలాల్లో మాస్క్ ధరించకపోతే విధించే జరిమానాను ఏప్రిల్ 2 నుంచి ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు తిరిగి ఆ నిబంధన అమలు చేసే అవకాశాలున్నాయి.


Also read: PM Kisan Yojana: పీఎం కిసాన్​ యోజన 11 విడత నిధుల విడుదల ఎప్పుడంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook