Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ
Navjot Singh Sidhu: కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ పదవకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉత్తరా ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.
Navjot Singh Sidhu: ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటిమికి బాధ్యత వహిస్తూ.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామా చేయాలన్ని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందిన విషయం తెలిసింది. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉత్తర ఖండ్ పీసీసీ అధ్యక్షుడు గణేశ్ గోడియాల్ రాజీనామా చేశారు.
ఇక తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో సోనియా గాంధీకి పంపిన తాన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నేను రాజీనామా చేశానంటూ తెలిపారు సిద్దూ.
ఇక మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా త్వరలోనే రాజీనామా చేసే వీలుంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్ఠానం సీరియస్..
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇందులో భాగంగా ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి.. సోనియా, రాహుల్, ప్రియాంకలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే సీడబ్ల్యూసీ సభ్యులు ఆ ప్రతిపాపదనను తిరస్కరించారు. కాగా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను తప్పించనట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో యువతకు అవకాశమిచ్చే వీలుంది.
Also read: Sonia Gandhi: ఐదురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం!
Also read: India Corona Update: దేశంలో కొత్తగా 2,876 మందికి కొవిడ్- తగ్గిన యాక్టివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook