'కరోనా వైరస్' మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ.. ఆ మహమ్మారిని నిత్యం ఎదుర్కొంటున్న వైద్యులు, వైద్య సిబ్బందికి భారత త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"185114","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


ఈ కార్యక్రమంలో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు, భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు, నావికదళానికి చెందిన హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హరియాణాలోని పంచకుల ప్రభుత్వాసుపత్రిలో భారత ఆర్మీ జవాన్ల బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఆస్పత్రిపై నుంచి పూల వర్షం కురిసింది. కరోనా మహమ్మారితో నిత్యం యుద్ధం చేస్తున్న వైద్యులారా అందుకోండి మా గౌరవ వందనాలు అంటూ పూలవర్షం కురిపించారు.



అలాగే గోవాలోని పనాజీలో మెడికల్ కాలేజీపైనా భారత నావికా దళానికి చెందిన హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. నావికాదళానికి చెందిన సిబ్బంది.. వైద్యులకు గౌరవ వందనం చేశారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..