Sharad Pawar: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ హాట్ కామెంట్స్ చేశారు. లోక్ సభ, శాసన సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే దానిపై ఉత్తర భారతం సానుకూలంగా లేదన్నారు. దీనిని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఈమేరకు పూణె డాక్టర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తన కుమార్తె లోక్ సభ ఎంపీ సుప్రియా సూలేతో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌ సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలన్న బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉందన్నారు. ఈవిషయంలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్లుందని హాట్ కామెంట్స్ చేశారు శరద్ పవార్. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈమేరకు బదులు ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్న సమయం నుంచి దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోందని గుర్తు చేశారు. దీనికి ఉత్తర భారతదేశం అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. 


మహిళా రిజర్వేషన్ బిల్లుపై తాను మాట్లాడుతుండగా తమ పార్టీకి చెందిన ఎంపీలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు జీర్ణించుకోలేకపోయారన్న అంశం తనకు అర్థమయ్యిందన్నారు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను మహారాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్, పంచాయతీ సమితి వంటి స్థానిక సంస్థల్లో సంస్కరణాలు తీసుకొచ్చానని తెలిపారు.


ఆ సమయంలో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశ పెట్టానని గుర్తు చేశారు శరద్ పవార్. దీనిపై మొదట్లో వ్యతిరేకత వచ్చినా..ఆ తర్వాత ప్రజలంతా ఆమోదించారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.


Also read:NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ వేట..ఉగ్ర మూలాలపై ఏకకాలంలో సోదాలు..!


Also read:T20 World Cup 2022: మెగా టోర్నీకి కౌంట్ డౌన్..యూఏఈ తుది జట్టు ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి