షాద్‌నగర్‌లో యువతిపై అత్యాచారం, హత్య కేసుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
షాద్‌నగర్‌లో యువతిపై దారుణంగా అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్(NCW) స్పందించింది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులకు వెంటనే తగిన శిక్షపడేలా చూస్తామని జాతీయ మహిళా కమిషన్ స్పష్టంచేసింది.
హైదరాబాద్: షాద్‌నగర్‌లో యువతిపై దారుణంగా అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్(NCW) స్పందించింది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులకు వెంటనే తగిన శిక్షపడేలా చూస్తామని జాతీయ మహిళా కమిషన్ స్పష్టంచేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసి సజ్జనార్‌కి శనివారం ఓ లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ.. కేసు పురోగతి, తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాల్సిందిగా సూచించారు.
ఇదిలావుంటే, మరోవైపు ఈ కేసు విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి నేతృత్వంలో ఓ కమిటీని నియమించినట్టు కమిషన్ స్పష్టంచేసింది. ఈ కమిటీ సభ్యులు శనివారం శంషాబాద్‌లోని బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వేగంగా కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.