NEET 2022 Scam: నీట్ పరీక్షల కుంభకోణం కలకలం రేపుతోంది. నీట్ 2022 పరీక్ష రిగ్గింగ్ అయింది. అవును ఎన్నికల్లో జరిగినట్టే ఇక్కడా రిగ్గింగ్ జరిగింది. ఒకరి బదులు మరో అభ్యర్ధి పరీక్ష రాస్తాడు. లక్షల్లో బేరాలు సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష ప్రారంభం నుంచీ వివాదాస్పదంగానే మారుతోంది. నీట్ 2022 పరీక్ష మరోసారి రిగ్గింగ్ అయింది. మెడికల్ కళాశాలలో సీటు వచ్చేలా చేసేందుకు కనీసం 20 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఆ గ్యాంగ్. ఇందులోంచి 4-5 లక్షల రూపాయలు అసలు అభ్యర్ధికి బదులు పరీక్ష రాసే మెడికల్ కళాశాల విద్యార్ధికి లేదా కోచింగ్ సెంటర్ నిపుణుడికి చెల్లిస్తారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. 


నీట్ 2022 పరీక్షలో బయటపడిన ఈ రిగ్గింగ్ భాగోతం కలకలం రేపుతోంది. అసలు అభ్యర్ధికి బదులు మరొకరితో పరీక్ష రాయిస్తుండగా సీబీఐ పట్టుకుంది. ఇలా 8 మందిని సీబీఐ అరెస్టు చేయగా..మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమందికి ఇందులో పాత్ర ఉండి ఉంటుందనే విషయాన్ని కొట్టిపారేయలేమని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర కుంభకోణంలో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలతో సంబంధాలు ఉండి ఉండవచ్చని సీబీఐ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. 


ఎలా జరిగింది అసలు


ఇదంతా ఎలా జరిగింది అసలు..దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు బదులు మరొకరు పరీక్షలు ఎలా హాజరు కాగలిగారనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెకింగ్ జరిగిన తరువాతే పరీక్షా కేంద్రాల్లో అనుమతించే పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమైందో అర్ధం కావడం లేదు. కేరళలో ఓ అమ్మాయి బ్రా హుక్స్ మెటల్ కావడంతో లో దుస్తులు విప్పిన తరువాత అనుమతించిన పరిస్థితి అందరికీ తెలుసు. అంత కచ్చితంగా చెకింగ్ ఉన్నప్పుడు ఒకరి బదులు మరొకరు ఎలా హాజరయ్యారు..


జరిగింది ఇలా


ఈ కుంభకోణానికి పాల్పడిన గ్యాంగ్..సంబంధిత విద్యార్ధుల్నించి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కోరుతుందని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసేటప్పుడు సంబంధిత గ్యాంగ్ అడ్మిట్ కార్డును మార్ఫింగ్ చేస్తుంది. అసలు విద్యార్ధి ఫోటో స్థానంలో..ఎవరైతే పరీక్ష రాస్తాడో ఆ వ్యక్తి పోటో చేరుస్తారు. అనుకున్న ప్లాన్ ప్రకారం..ఆ వ్యక్తి పరీక్షా కేంద్రానికి చేరుకున్న తరువాత అక్కడుండే సంబంధిత సిబ్బంది అడ్మిట్ కార్డులోని ఫోటోను ఆ వ్యక్తితో సరిపోల్చుకుని..పరీక్షా కేంద్రంలో అనుమతిస్తారు. 


ఎంత వసూలు చేస్తారు


మెడికల్ కళాశాలలో సీటుకు గ్యారంటీ ఇచ్చేందుకు లేదా నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించే షరతుపై కనీసం 20 నుంచి 50 లక్షల వరకూ ఆ గ్యాంగ్ డిమాండ్ చేస్తుంది. ఇందులో 4-5 లక్షలు అసలు విద్యార్ధి స్థానంలో పరీక్ష రాసే మెడికల్ కళాశాల విద్యార్ధి లేదా కోచింగ్ సెంటర్ ఎక్స్‌పర్ట్స్‌కు చెల్లిస్తారు. ఇదంతా సఫ్దర్‌జంగ్ మెడికల్ కళాశాలలో పనిచేసే ఓ డాక్టర్ చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. అతనే గ్యాంగ్ సభ్యులు, విద్యార్ధులు, పరీక్షా రాసే వారితో సంప్రదింపులు జరుపుతాడు. ఈ కుంభకోణంలో కొన్ని కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉందని తెలిసింది. 


Also read: Indian Armed Forces: భారత త్రివిధ దళాల్లో 1,35,784 మంది సిబ్బంది కొరత... రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook