NEET 2024 Counselling: నీట్ కౌన్సిలింగ్‌కు సిద్ధమౌతున్నారా, ఏయే సర్టిఫికేట్లు కావాలో తెలుసా
NEET 2024 Counselling Checklist: మరో మూడు రోజుల్లో నీట్ 2024 కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సిలింగ్‌కు ఎలా సిద్దమవాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.
NEET 2024 Counselling Checklist: అనేక వివాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు తరువాత నీట్ 2024 వివాదానికి తెరపడింది.నీట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 14 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024-25 విద్య సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో నీట్ కౌన్సిలింగ్‌కు ఎలా తయారవాలి, ఏయే సర్టిఫికేట్లు వెంట ఉంచుకోవాలనేది ఓ సారి పరిశీలిద్దాం.
నీట్ 2024 పరీక్ష వివాదం ముగిసిన సుప్రీంకోర్టు తుది తీర్పు తరువాత ర్యాంకులు కూడా రివైజ్ అయ్యాయి. ఆ తరువాత నీట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 21 వరకూ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ జరగనుంది. మొదటి దశకు సంబంధించి ఆగస్టు 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 24 నుంచి 29 లోగా వివిధ కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండవ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 5 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 14 నుచి 20 వరకూ ఆయా కళాశాలల్లో చేరాలి. ఇక చివరి దశ అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 20 వరకు ఉంటుంది. అక్టోబర్ 23 వరకూ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు కళాశాలల్లో చేరాలి. కౌన్సిలింగ్‌కు సిద్ధమైన విద్యార్ధులు ఏయే సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలో జాబితా ఇదీ..
నీట్ కౌన్సిలింగ్‌లో కావల్సిన సర్టిఫికేట్లు
నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు, నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డు, నీట్ యూజీ 2024 డొమిసైల్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ ధృవీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో, 6 నుంచి 10వ తరగతి వరకూ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ స్టడీ, పాస్ సర్టిఫికేట్లు, మైగ్రేషన్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇంటర్ టీసీ, కుల ధృవీకరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇన్‌కం సర్టిఫికేట్, దివ్యాంగులయితే దివ్యాంగ ధృవీకరణ సర్టిఫికేట్
Also read: Cheapest Flight ticket: ఢిల్లీ నుంచి అక్కడికి కేవలం 999 రూపాయలే ఫ్లైట్ టికెట్, లిమిటెడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook